ఇద్దరు మిల్లర్స్@స్టిక్కర్ దందా…?

అసోసియేషన్ పేరుతో ఆ ఇద్దరు మిల్లర్స్ ఎడతెగని దందా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి…జిల్లా పౌరసరఫరాల అధికారి కొందరు మిల్లర్లను తన గుప్పిట్లో పెట్టుకొని వారికి అనుకూలంగా పనిచేస్తున్నాడని,బ్లాక్ లిస్ట్ లో ఉన్న మిల్లర్లు,సర్కార్ కు బకాయి ఉన్న మిల్లర్లు ఇవేమీ పట్టించుకోకుండా తనను ప్రసన్నం చేసుకుంటే చాలు ధాన్యం కేటాయిస్తున్నాడని ఇటీవల న్యూస్10 కథనాలను వెలువరించింది…ఈ కథనాల తో జిల్లా కలెక్టర్ కమలపూర్ మండలం కనిపర్తి,మరిపెల్లి గూడెం లో ఉన్న ధాన్యాన్ని వేరే మిల్లులకు తరలించారు…అంతేకాదు ప్రస్తుతం ఆ మిల్లుల్లో ఎంత ధాన్యం ఉందో ఫిజికల్ గా తనిఖీలు నిర్వహించారు…ఇలా తీగ లాగితే డొంక కదిలినట్లు.. ఈ రెండు మిల్లులకు చెందిన మిల్లర్,మరో మిల్లర్ వసూళ్ల భాగోతం ఒకటి తాజాగా బయటపడింది… నిజానికి ఈ వసూళ్ల దందా ఎప్పటినుంచో కొనసాగుతున్న న్యూస్10 వరుస కథానాల నేపథ్యంలో చేసిన పరిశీలనలో ఈ దందా బట్టబయలైంది….

అంతా ఆ ఇద్దరు మిల్లర్లే….?

అధికారి అండగా ఉన్నాడు,తాను డబ్బు బలంతో ఏదైనా చేయగలను ,కోట్ల రూపాయల ధాన్యం సర్కార్ కు బకాయి ఉన్న తనను అనే వారు లేరు అనే అతి విశ్వాసం ఉన్న మిల్లర్ ఒకరు…తాను అసోసియేషన్ కు బాస్ ను, మిల్లర్లు తాను తాన అంటే తందాన అంటారు, పైగా రాష్ట్రంలో ఓ మంత్రి తన చుట్టం అని అధికారులు తాను ఆడించినట్లు ఆడుతారు అని తెలివి మీరి మాట్లాడే మిల్లర్ ఒకరు…ఇప్పుడు వీరిద్దరూ కలిసి హన్మకొండ మిల్లర్స్ అసోసియేషన్ పేరుతో స్టిక్కర్ దందాకు తెర తీశారు..

ఏంటి స్టిక్కర్ దందా…?

మిల్లును నిర్వహిస్తున్న ప్రతి మిల్లర్ తనకో ధైర్యం ఉంటుంది..సమూహంగా కలిసి ఉంటే సమస్యలను పరిష్కరించుకోవచ్చు అనే ఉద్దేశ్యంతో మిల్లర్స్ అసోసియేషన్ లో సభ్యులుగా చేరతారు…వారికి ప్రాతినిధ్యం వహించేందుకు ఓ అధ్యక్షుడిని,ప్రధాన కార్యదర్శిని ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు…ఇక్కడవరకు బాగానే ఉంటుంది కానీ తమను అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్నుకున్నారని వారికి వారే అతిగా ఊహించుకొని ఈ ఇద్దరు మిల్లర్స్ తమ తోటి మిల్లర్లనే పీడించడం మొదలుపెట్టారట… వసూళ్ల దందాకు దిగారట వసూళ్ల దందా అంటే అలా ఇలా కాదు గోడౌన్ లో లారీ దిగాలి అంటే ఆ మిల్లర్ అక్షరాల 5 వేల 5 వందలు చెల్లించాల్సిందేనట…అక్కడే ఉండి వీరు వసూలు చేయలేరు కనుక…ఒక వేళ వసూల్ ఐయిన లెక్క తెలియాలి కనుక ఈ ఇద్దరు మిల్లర్లు తెలివిగా స్టిక్కర్ దందా కు ప్లాన్ చేశారు…ధాన్యం గోడౌన్ కు చేరేటప్పుడు తీసుకువెల్లే వే బిల్లు వెనకాల అసోసియేషన్ పేరుతో ముద్రించిన స్టిక్కర్ ఉంటేనే ఆ ధాన్యం గోడౌన్ లో దిగుతుంది… స్టిక్కర్ లేదంటే ఇక అంతే సంగతులు ఎట్టిపరిస్థితుల్లో ఆ ధాన్యం గోడౌన్ లో దిగదన్నమాట…మరి ఇది గోడౌన్ లో ఎలా సాధ్యం అంటే అక్కడ అధికారులు వీరికి సహకరిస్తున్నారు…వీరు ప్రవేశపెట్టిన ఈ అనధికార స్టిక్కర్ దందాకు వారు తలలు ఊపుతున్నారు కనుక సాధ్యం అవుతుందట…చిన్నా చితక మిల్లర్లకు ఇది భారంగా పరిణమించిన అసోసియేషన్ ముసుగులో వారు చేస్తున్న దందాకు వారు విధి లేక అంగీకరించాల్సి వస్తుందని మిల్లర్స్ లో చర్చ జరుగుతోంది.. అసోసియేషన్ మిల్లర్స్ కు భరోసా ఇవ్వాలి కాని పదవుల ముసుగులో ఇలా భాజాప్త వసూళ్లకు పాల్పడడం ఏంటని వారిలోవారు ప్రశ్నించుకుంటున్నారు…మాకు వాళ్ళు తెలుసు,వీళ్ళు తెలుసు అంటూ మిల్లర్స్ ముందు డాంబికాలు మాట్లాడే ఈ మిల్లర్స్ ఇద్దరు కలిసి ఇలా ఎందుకు 5 వేల 5 వందల రూపాయలు వసూల్ చేస్తున్నారో..ఈ వసూల్ దందాకు పౌర సరఫరాల శాఖ లోని కొందరు అధికారులు వత్తాసు పలుకుతున్నారో తెలియాలి…అంతే కాదు ఈ 5 వేల 5 వందల వసూల్ దందా లో అధికారుల పాత్ర ఎంతో బహిర్గతం కావాల్సివుంది…దీనిలో పై కొసరు ఓ డి టి యస్ మేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి…అందుకే ఈ ఇద్దరు మిల్లర్స్ ఆ మొత్తాన్ని 5 వేల 5 వందలు చేసి ఆ డి టి యస్ కు సమర్పిస్తున్నారని సమాచారం…ఆ డి టి యస్ భాగోతం న్యూస్10 త్వరలో బయటపెట్టనుంది….ఇక స్టిక్కర్ పేరుతో వసూళ్లు చేస్తున్న ఆ ఇద్దరు మిల్లర్ల దందా పై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here