మార్కాపురం బస్సు ప్రమాదం లో విషాద ఘటన చోటు చేసుకుంది… బస్సు ప్రమాదం జరిగి మంటలు అంటుకోగానే తన కొడుకును బస్సు లోంచి బయటకు తోసి తాను మంటల్లో సజీవదహనం ఐయింది… ఈ హృదయ విదారక ఘటన అందరిని కలచి వేస్తోంది…కనిగిరి మండలం మందాడివారిపల్లికి చెందిన ఉప్పు రమాదేవి(45), కొడుకు మనోహర్, ప్రమాదానికి గురైన బస్సులో స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగిన వెంటనే మంటలను గమనించి కొడుకును బయటికి తోసేసిన రమాదేవి మంటలు ఎక్కువ కావడంతో బస్సులో చిక్కుకుని, కొడుకు కళ్లెదుటే సజీవదహనమైంది…



