చెప్పింది చెప్పినట్లే

ఎంజీఎం పెద్దాసుపత్రిలో ఆ కాంట్రాక్టర్ చెప్పింది చెప్పినట్లు చెల్లుబాటు అవుతుంది…కోట్ల రూపాయల బిల్లులు పాస్ కావాలన్న ఎంజీఎం లోని అధికారులకు కాస్త కనుసైగ చేస్తే చాలు ఇట్టే బిల్లులు పాస్ ఐయి ఆ కాంట్రాక్టర్ అకౌంట్ లో నిక్షేపంగా డిపాజిట్ అవుతున్నాయట…ఎంజీఎం లో బిల్లులు మంజూరి చేయడానికి ఒకటికి రెండుసార్లు అన్ని పరిశీలించి ఒకే చెప్పాల్సిన ఆర్ ఎం ఓ స్థాయి అధికారులు ఆ కాంట్రాక్టర్ చెప్పింది చెప్పినట్లే చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి…ఉద్యోగుల హాజరు పట్టిక,సానిటేషన్ ఇతర పనుల తీరు ఏమాత్రం పరిశీలించకుండానే 5 కు 5,10 కి 10 మార్కులు వేస్తూ 90 శాతానికి పైగా సంతృప్తికరం అని ముద్ర వేసి మరి కళ్ళు మూసుకొని సంతకం పెట్టేస్తున్నారు…ఇంకేముంది ఆ కాంట్రాక్టర్ తాను నియమించుకున్న ఉద్యోగుల సంఖ్యతో ఏమాత్రం పొంతన లేకుండా అధికారులు ఎంతమంది ఉద్యోగులు కావాలని నిబంధనల ప్రకారం ఆడిగారో అంతమంది లేకున్నా ఉన్నారని నమ్మబలికి అంతమంది ఉద్యోగుల పేరుతో అప్పనంగా డబ్బులు దండుకుంటున్న ఎంజీఎం అధికారులు సహకరిస్తున్నారు తప్ప ఇదేంటని…?అడిగేవారు లేకుండా పోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి… తాజాగా కోటి రూపాయల పైగా బిల్లు తీసుకునేందుకు అధికారుల సంతకాల కోసం సదరు కాంట్రాక్టర్ సిద్ధమైనట్లు తెలిసింది…ఎంజీఎం అధికారులు సైతం ఉద్యోగుల హాజరు పట్టిక,ఉద్యోగుల సంఖ్య,సానిటేషన్ విషయంలో పనితీరు తదితర అంశాలను ఏవి పరిశీలించకుండానే 96 శాతం సంతృప్తికరం అని ఓ సర్టిఫికెట్ ఇచ్చి బిల్లు పాస్ చేసేందుకు రంగంసిద్దం చేసినట్లు తెలిసింది… కాగా ఆ కాంట్రాక్టర్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల అటెండెన్స్ మస్టర్ ఇచ్చేందుకు సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ఎంజీఎం అధికారులు ఇవ్వకపోవడం ఇక్కడ ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్థం అవుతుంది…కాంట్రాక్టర్ కే దాసోహం అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంజీఎం అధికారులు ఆ కాంట్రాక్టర్ బిల్లుకు నో చెప్తారా…?లేక ఎప్పటిలాగే 96 శాతం సంతృప్తికరం అంటూ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా…?చూడాలి…

ఎంజీఎం లో అధికారుల తీరు…

ఆ కాంట్రాక్టర్ వ్యవహారంపై…న్యూస్10 విశ్వసనీయ కథనం …సాయంత్రం సంచికలో…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here