అసలు ధాన్యం లేదు, గన్ని బ్యాగులు లేవు,ధాన్యం ట్రాన్స్పోర్ట్ చేసింది లేదు కానీ సర్కార్ సొమ్మును మాత్రం భారీగా నొక్కేశారు…ఓ మిల్లర్ జోక్యంతో ఏ ఓ ,ఏ ఈ ఓ లు ఓ ప్రయివేట్ వ్యక్తి సాయంతో ధాన్యం వివరాలు సర్కార్ సైట్ లో నమోదు చేసి అందినకాడికి దండుకున్నారు…ఓ మిల్లర్ భార్య, కూతురు,కుమారుడు,అల్లుడు పేరుతో ధాన్యం వివరాలు నమోదు చేసి ధాన్యం కుంభకోణానికి తెర తీశారు…ఇప్పుడు ఈ విషయంలో విజిలెన్స్ తీగ లాగడంతో కుంభకోణం డొంక కదులుతుంది..ముఖ్యంగా శాయంపేట మండలం కేంద్రంగా కుంభకోణం భారీగా జరిగినట్లు విజిలెన్స్ ప్రాథమిక విచారణలో తెలినట్లు తెలుస్తుంది… ఈ విచారణలో విజిలెన్స్ అధికారులే విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నట్లు సమాచారం…రాష్ట్రంలో సివిల్ సప్లయీస్ ఇలా ఏమాత్రం ధాన్యం లేకుండా ఇంతటి స్కామ్ జరగడం చర్చనీయాంశంగా మారింది…ఈ స్కామ్ పై విచారణ చేసేందుకు ఎస్పీ ,డిఎస్పీ స్థాయి అధికారులు శాయంపేటకు వచ్చినట్లు తెలుస్తోంది…ఈ ధాన్యం కుంభకోణం లో ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే అంశంలో కూపీ లాగుతున్నట్లు తెలియవచ్చింది…కాగా ఓ మిల్లర్ సతీమణి కి ధాన్యం డబ్బులు 24 లక్షలు జమ కావడంతో అనుమానం వచ్చిన విజిలెన్స్ అధికారులు ఆరా తీయడంతో ధాన్యం స్కామ్ బయటపడినట్లు తెలుస్తుంది….ధాన్యం ఏమాత్రం లేకుండా మిల్లర్ కుటుంబ సభ్యలను,ఇతరులను రైతులుగా పేర్కొంటూ కేవలం కాగితాలపై లెక్క చూపించి గాలి లెక్కలతో స్కామ్ చేయడం విజిలెన్స్ అధికారులనే విస్మయానికి గురిచేసింది…ట్రక్ షీట్స్,రశీదులు,గన్ని బ్యాగ్స్ ,ట్రాన్స్ పోర్ట్ వివరాలతో దొంగ లెక్కలు నమోదు చేసి కోట్లల్లో సర్కార్ సొమ్మును కొట్టివేసినట్లు విజిలెన్స్ అధికారులు విచారణలో తేలింది….మంగళవారం హైదరాబాద్ నుంచి హన్మకొండ చేరుకున్న విజిలెన్స్ ప్రత్యేక బృందం దీనిపై విచారణ కొనసాగిస్తోంది…
ఈ భారీ ధాన్యం కుంభకోణానికి సంబంధించి న పూర్తి వివరాలు
న్యూస్10 సాయంత్రం సంచికలో….



