పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారం పై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం

పార్టీకి నష్టం కలిగించే వ్యవహారాలపై చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్దమైంది.. ఈ నేపథ్యంలో మాజి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారం పై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..మాదక ద్రవ్యాల వినియోగం ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి పార్టీ అధినేత కేసీఆర్ షోకాజ్ నోటీసు జారీ చేశారు…వారం రోజుల్లోగా మీడియా ద్వారా వచ్చిన ఆరోపణలపై స్పష్టంగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని కేసీఆర్ రోహిత్ రెడ్డి ని ఆదేశించారు…షోకాజ్ నోటీసుకు గడువులోపు వివరణ సమర్పించడంలో విఫలమైతే పార్టీ నియమావళి ప్రకారం వేటు వేయక తప్పదని నోటిస్ లో తెలిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here