పొగ మంచు ఎఫెక్ట్…విమానాలు రద్దు

అతి తక్కువ ఉష్ణోగ్రతలతో చలి పులి వణికిస్తుంటే ,దానికి తోడు అధికంగా వస్తున్న పొగ మంచు కారణంగా ప్రయాణం కష్ట సాధ్యంగా మారుతోంది…. దేశ వ్యాప్తంగా అనేక విమానాలు రద్దు అవుతున్నాయి… పొగ మంచు కారణంగా కొన్ని విమానాలు గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి…తాజాగా ఈ పొగ మంచు ఎఫెక్ట్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పై పడింది…మంగళవారం ఉదయం అత్యధిక పొగ మంచు కారణంగా కొన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి…ఢిల్లీ ,చండీగఢ్,విశాఖపట్నం వెళ్లాల్సిన విమాన సర్వీసులను రద్దు చేశారు..పొగ మంచు ఎఫెక్ట్ తో విమాన సర్వీసులు రద్దు కాగా ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సి వస్తుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here