అర్ధరాత్రి పోలీసుల అదుపులో ఆశ వర్కర్లు…
నైటీలతోనే పోలీస్ స్టేషన్‌కు తరలింపు..
తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న ఆశా వర్కర్లు చలో అసెంబ్లీకి పిలుపునివ్వడంతో పోలీసులు అర్ధరాత్రి వేళ ఆశ వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు . మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాల్లో పనిచేస్తున్న ఆశవర్కర్లను శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు… గత అర్దరాత్రి అదుపులోకి తీసుకున్న ఆశవర్కర్లను ఇప్పటికి పోలీసులు వదిలిపెట్టలేదు…శ్రీరామ నవమి పండుగ పూట కుటుంబాలతో గడపాల్సిన మహిళా కార్యకర్తలను, కనీసం దుస్తులు మార్చుకునే సమయం కూడా ఇవ్వకుండా నైటీలపైనే పోలీస్ స్టేషన్‌కు తరలించడం పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.కాగా కొంతమందిని
గత రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో పోలీసులు ఆశా వర్కర్ల నివాసాలపై పడి బలవంతంగా అరెస్టులు చేశారు.
కనీసం మహిళా పోలీసులు లేకుండానే పురుష పోలీసులు ఆశ వర్కర్లను రాత్రి వేళ అదుపులోకి తీసుకున్నారని ఆశ వర్కర్లు ఆరోపిస్తున్నారు…. మహిళలు బట్టలు మార్చుకుంటామని ప్రాధేయపడినా వినకుండా, నైటీలపైనే స్టేషన్‌కు తీసుకువచ్చినట్లు ఆశ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు.. అరెస్టయిన వారిలో ఒకరికి ఇటీవల స్టంట్ ఆపరేషన్ జరిగినట్లు సమాచారం. ఆమె పరిస్థితిని కూడా లెక్కచేయకుండా పోలీసులు బూతులు తిడుతూ దౌర్జన్యం చేశారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.స్టేషన్‌లో ఉన్న మహిళలకు కనీసం తాగునీరు, ఆహారం కూడా అందించకుండా, వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని పోలీసులు వేధించారని ఆశ వర్కర్లు ఆరోపించారు…
ఆశా వర్కర్ల ప్రధాన డిమాండ్లు:
ఉద్యోగ భద్రత కల్పించాలి.
ఇన్సూరెన్స్ మరియు సీనియార్టీ ప్రకారం జీతభత్యాలు పెంచాలి.
ప్రభుత్వం తక్షణమే స్పందించి బెనిఫిట్స్ అందజేయాలి.
కడిపికొండ, రాంపేట, మడికొండ, అయోధ్యపురం, బోడాగుట్ట, ఇందిరమ్మ కాలనీ, కంచరవాడ, కండలడబ్బ వంటి సుమారు 15 ప్రాంతాల ఆశా వర్కర్ల ప్రతినిధులైన ఆదండ స్వరూప, ప్రభావతి, యాకోబి, సిహెచ్ శ్రీవాణి, రాజమణి, విజయలక్ష్మి తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారుడిమాండ్ చేస్తున్నారు.





