హన్మకొండ జిల్లా లోని ఓ మండలం లో ఆయన రెవెన్యూ అధికారి…రెవెన్యూ అధికారి అంటే అలాంటి ఇలాంటి రెవెన్యూ అధికారి కాదు ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేసి అందినకాడికి దండుకునే రెవెన్యూ అధికారి… పనికోసం ఎవరైనా అతగాడి వద్దకు వెళ్తే చాలు చేయి తడపనిదే ఫైల్ కదలదు… పని కాదు… ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే తనతో కాని పనిని, అతగాడు చేయని పనిని సైతం చెస్తానని నమ్మబలికి డబ్బులు వసూలు చేయడంలో ఇతగాడు సిద్ధహస్తుడని ఆరోపణలు వస్తున్నాయి…ఇప్పటికే సారు తమకు పనిచేసి పెడతాడని మండలంలోని పలువురు ముందుగానే ప్రసన్నం చెసుకుంటే ఇదిగో అవుతుంది పని,అదిగో అవుతుంది పని అంటూ తన చుట్టూ తిప్పుకుంటున్నట్లు తెలిసింది…అంతేకాదు పని చేస్తానని డబ్బులు వసూళ్లు చేయడమే కాకుండా పని త్వరగా చేయాలంటే మరింత డబ్బు కావాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలియవచ్చింది… ఇదిలాఉంటే ఈ రెవెన్యూ అధికారి వసూళ్ల భాగోతం బయటపడి విషయం విజిలెన్స్ దాకా పోవడంతో వేరే మండలానికి బదిలీ చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది…రెవెన్యూశాఖ లో అవినీతి జలగ గా మారి సామాన్య జనాలను పట్టి పీడిస్తున్న ఆ రెవెన్యూ అధికారి వసూళ్ల భాగోతం పై న్యూస్10 విశ్వసనీయ కథనం ఈరోజు సాయంత్రం సంచికలో….



