గతంలో సస్పెన్షన్ కు గురైన ఆ అధికారి దాని నుంచి ఎలాంటి గుణపాఠం నేర్వనట్లుంది… సస్పెన్షన్ కామనే నాకు నేను చేసే పని నేను చేస్తా అన్నట్లు సదరు అధికారి తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు బాగానే ఆరోపణలు వస్తున్నాయి… గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బాద్యతలు నిర్వహిస్తూ సస్పెన్షన్ గురైన అదే అక్రమ పోకడ కొనసాగించడం పట్ల విమర్శలు వస్తున్నాయి… విమర్శలు ఎన్ని వచ్చిన వరంగల్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆ సారు తన ఇష్టారీతిన రిజిస్ట్రేషన్లు కానిస్తున్నట్లు తెలుస్తుంది.కార్యాలయం దగ్గర ఉండే కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు,కొందరు రియల్టర్లు చెప్పింది చెప్పినట్లుగా వింటూ ఆ అధికారి పనులు చేసేస్తున్నట్లు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి….
అవును పాఠం నేర్వలేదు…?
ఆ సబ్ రిజిస్ట్రార్ కు సస్పెన్షన్ పాఠం కాకుండా పోయినట్లు కనిపిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ లు చేసి సస్పెండ్ అయినప్పటికీ సదరు అధికారిలో ఎలాంటి మార్పు కనిపించడంలేదని విశ్వసనీయంగా తెలిసింది.సాధారణంగా ఏ అధికారి అయినా ఒక్కసారి సస్పెండ్ అయితే మళ్ళీ అలాంటి పొరపాట్లు చేయకుండా ఉంటారు. కానీ ఈ సబ్ రిజిస్ట్రార్ మాత్రం అవేమి పట్టించుకోకుండా మళ్ళీ నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ లు చేసి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకే సవాల్ విసురుతున్నట్లు సదరు సబ్ రిజిస్ట్రార్ చేసిన రిజిస్ట్రేషన్ లు పరిశీలిస్తే స్పష్టంగా కనిపిస్తోంది.ప్రస్తుతం వరంగల్ ఆర్వో పరిధిలోని వరంగల్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహిస్తున్న ఈ అధికారి గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఓ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహించినప్పుడు నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ లు చేసి సస్పెండ్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. గత కొన్ని నెలల క్రితం బదిలీ పై వచ్చి వరంగల్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ గా కొనసాగుతున్న సదరు అధికారి మళ్ళీ నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ లు చేసినట్లు న్యూస్-10 పరిశీలనలో తేలింది.గతంలో ఏవిధంగానైతే నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ లు చేసినందుకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో సస్పెండ్ అయ్యాడో, ఇప్పుడు అలాగే వరంగల్ రూరల్ కార్యాలయంలో కూడా సస్పెండ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
న్యూస్-10 కు చిక్కిన సైదులు చిట్టా…!
జిల్లా రిజిస్ట్రార్ స్పందనేంటో?
బ్లాస్టింగ్ కథనం మీ న్యూస్-10 లో



