ఆ ఐ పి ఎస్ అధికారి సామాన్య భక్తులపై తన హీరో ఇజాన్ని ప్రదర్శించాడు… సముదాయించి బెదిరించాల్సింది పోయి చేతికి పని చెప్పాడు… తమ సారే ఆలా చేస్తుంటే కానిస్టేబుల్ ఊరుకుంటారా వారు అదే అనుసరించారు.. మేడారం మహా జాతరలో సహనం కోల్పోయి దురుసుగా ప్రవర్తించిన ఏటూరునాగారం ఎ ఎస్పీ పై విమర్శలు వస్తున్నాయి…మేడారం మహజాతరలో పోలీసులు ఉన్నది బందోబస్తు కోసం,ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడం కోసం,ఎవరైనా భక్తులు తెలిసి తెలియక ఆవేశ పడిన సముదాయించి శాంత పరిచి పరిస్థితిని చక్క దిద్దడం కోసం అంతేకానీ బందోబస్తు పేరుతో జాతరను మొత్తం తమ చేతుల్లోకి తీసుకొని సామాన్య భక్తులను రక్తం వచ్చేలా చితక బాదడం కోసం కాదు.. నేను ఐ పి ఎస్ నేను చెప్పినట్లు వినాలి నాకు అధికారం ఉంది అంటూ లాఠీలతో విరుచుకు పడడం కాదు..ఇరవై ముప్పై మంది కానిస్టేబుళ్లను వెంట వేసుకొని సామాన్య భక్తుల పట్ల కనీస మర్యాద చూపకుండా నేను అధికారిని అని గర్వం ప్రదర్శిస్తూ తల్లుల దర్శనం కోసం వచ్చిన భక్తులపై దండెత్తడం హీరో ఇజం ఏమాత్రం అసలే కాదు… జాతరలో కొందరు పోకిరీలు రహదారులపై అనుచితంగా ప్రవర్తిస్తున్న,పైటింగ్ లు జరుగుతున్న వాటిని కంట్రోల్ చేయకుండా దర్శనానికి వెళ్తున్న భక్తుల పట్ల పోలీసు అధికారులు దురుసుగా ప్రవర్తించడం విమర్శలకు దారితీస్తుంది…ఏటూరునాగారం ఏ ఎస్పీ మనన్ భట్ కొందరు పోలీసులను వెంటేసుకొని మేడారం మహా జాతర ప్రధాన ద్వారం వద్ద ప్రవర్తించిన దురుసు తీరు పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు…తల్లులను దర్శనం చేసుకోవాలన్న తాపత్రేయం లో కొందరు భక్తులు అతిగా ప్రవర్తించవచ్చు అంత మాత్రాన పోలీసు అధికారి భక్తుల పై చేయి చేసుకోవడం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి… పోలీసులు తమకు తెలిసిన వారిని ప్రధాన ద్వారం ద్వారా గేట్లు ఓపెన్ చేసి పంపడం పట్ల భక్తులు గుస్సాగా ఉన్నారు..తమనేందుకు పంపరని ప్రశ్నిస్తున్నారు…ఇది కేవలం పోలీసుల ప్రవర్తన వల్ల తలెత్తిన సమస్య అని వారు అంటున్నారు…



