స్వచ్చంద సేవ ముసుగులో అంతా దోపిడీ …వ్యసనపరులను బాగుచేస్తానని చెప్పి వారి వద్ద నుంచి అందినకాడికి దండుకోవడం…అనుమతులు ముగిసిపోయిన అడిక్షన్ సెంటర్ నిర్వహించడం…డాక్టర్ కాకున్నా డాక్టర్ అంటూ మందులు రాయడం ఇది హన్మకొండలోని హెల్పింగ్ హ్యాండ్ సంస్థ నిర్వాకం…సామాజిక సేవ అంటూ అన్ని అక్రమ పనులు చేయడం ఈ సంస్థ నిర్వాహకులు పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తుంది.. నిబంధనలకు విరుద్ధంగా సంస్థను నడుపుతూ ఎలాంటి అర్హత లేకున్నా తాను డాక్టర్ ను అంటూ డి అడిక్షన్ సెంటర్ లో జాయిన్ ఐన వారికి మందులు ఇస్తున్నాడని గత కొద్ది నెలల క్రితం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు చేసి నోటీసులు జారీ చేసిన ఈ నిర్వాహకుడి లో ఏమాత్రం మార్పు రానట్లు కనపడుతుంది… ఎప్పటిలాగే వంద మందికి పైగా మద్యపానానికి అలవాటు పడిన వ్యసన పరులను డి అడిక్షన్ సెంటర్ లో చేర్చుకొని చిత్రహింసలు పెడుతున్నట్లు తెలుస్తుంది….హెల్పింగ్ హాండ్స్ సంస్థ పేరుతో నిర్వాహకులు డి అడిక్షన్ దందా కు తెరలేపారు…
ఇది దందా తీరు…!
కేంద్ర ప్రభుత్వం నుంచి డీ అడిక్షన్ సెంటర్ ల కోసం ఇస్తున్న నిధుల గురించి తెలుసుకొని వాటిని రాబట్టే విధంగా హెల్పింగ్ హాండ్స్ సొసైటీ అనే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజషన్ నెలకొల్పి అదే పేరు మీద డీ అడిక్షన్ సెంటర్ ని హన్మకొండ లోని సర్క్యూట్ హౌస్ దగ్గరలో ఒక ఇంటిని కిరాయి తీసుకొని తన అక్రమ వ్యాపారానికి కొన్ని సంవత్సరాల క్రితం తెర లేపారు…ఈ సంస్థ పై జనవరిలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆకస్మిక తనిఖీలు చేసిన తీరు ఎప్పటిలాగే ఉంది..వ్యసన పరులకు చికిత్స పేరుతో ఓ దందానే షురూ చేసి వ్యసన పరులపై వచ్చిందే లాభం అన్నట్లు వ్యవహరిస్తున్నారు…వీరివద్ద నుంచి వివిధ ఖర్చుల పేరుతో ముక్కుపిండి వసూళ్లు చేస్తూ దందాను నిరాటంకంగా కొనసాగిస్తున్నారు….ఈ అడిక్షన్ సెంటర్ లో సంస్థ నిర్వాహకుడు తాను వైద్యుడిని అని పేర్కొంటూ వైద్యం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి…డాక్టర్ రాము అంటూ వ్యసనపరులకు ప్రెస్క్రిప్షన్ రాస్తూ తన అడిక్షన్ సెంటర్ లోనే మందులు విక్రహిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు…. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నియమాలకు విరుద్ధంగా కనీస ప్రమాణాలు పాటించకుండా డీ అడిక్షన్ భాధితులకు నరకం చూపిస్తు,
50 బెడ్స్ కి మాత్రమే అనుమతి తీస్కొని 80-110 మందిని అడ్మిట్ చేసుకొని దందాను కొనసాగిస్తున్నారు….వైద్య పరంగా ఎటువంటి విధ్యార్హత లేకపోవడం తో అధికారులు ఎవరైనా తనిఖీ చేసిన అనుమానం రాకుండా ఉండేందుకు డీ అడిక్షన్ థెరపీశిక్షణ తీసుకొని, తనకు తాను డాక్టరుగా పేర్కొంటూ తన డీ అడిక్షన్ సెంటర్ వచ్చే రోగులకు ఎటువంటి సైకియట్రిస్ట్ సలహా లేకుండా షెడ్యూల్ హెచ్ ఇతర సైకియాట్రి మందులు అధికమోతదులో ఇస్తూ, వాటిని చట్ట విరుద్ధoగా నిల్వ ఉంచి దుర్వినియోగం చేస్తూ వాటికి వారిని అలవాటు పడేలా చేస్తూ అడ్మిట్ అయిన వారిని రోజు కొట్టడం, స్క్రూ డ్రైవర్ లతో పొడవడం డి అడిక్షన్ దందాలో పనిగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది.
డీ అడిక్షన్ సెంటర్ డిసెంబర్ 2024 లోనే అనుమతి ముగిసినట్లు తెలిసింది…ఐయిన డి అడిక్షన్ సెంటర్ నడుపుతూ తోచినంత వసూలు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నట్లు తెలిసింది….అంతేకాదు నిబంధనలకు విరుద్ధంగా డి అడిక్షన్ సెంటర్ నడుపుతు అక్రమంగా వసూళ్లు చేస్తూ మరో జిల్లాలో పాగా వేసి దందా ను నడిపేందుకు హెల్పింగ్ హాండ్స్ నిర్వాహకుడు సిద్ధమైనట్లు సమాచారం…
హెల్పింగ్ హాండ్స్ లీలలు…
అన్ని ఇన్ని కావు…
మరో సంచికలో….



