నలుగురు ఐ పి యస్ ల బదిలీ

నలుగురు ఐ పి యస్ లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది… ఫ్యూచర్ సిటీ పేరుతో మరో నూతన కమిషనరేట్ ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది…ఫ్యూచర్ సిటీని ప్రత్యేక కమిషనరేట్‌గా ప్రకటించింది..కాగా రాచకొండ కమిషనరేట్ పేరును మల్కాజిగిరి కమిషనరేట్‌గా మార్పు చేస్తూ, భువనగిరి జిల్లాను కమిషనరేట్ పరిధి నుండి మినహాయిస్తూ నిర్ణయం తీసుకుంది సర్కార్.. రాచకొండ కమిషనర్ సుధీర్ బాబుని ఫ్యూచర్ సిటీ కమిషనర్‌గా, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మొహంతిని మల్కాజిగిరి కమిషనర్‌గా, ప్రొవిషనింగ్ అండ్ లాజిస్టిక్స్ ఐజీ రమేష్ ను సైబరాబాద్ కమిషనర్‌గా, యాదాద్రి భువనగిరి డీసీపీ అక్షన్ష్ యాదవ్ ను, యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీగా బదిలీ చేస్తూ  తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here