బావ, బావ మరుదులకు ఒళ్ళంతా విషం…

తెలంగాణాలో కాంగ్రెస్‌కు వస్తున్న ఆదరణ ను వారు చూడలేకపోతున్నారు
ఒళ్లంతా విషం నింపుకొని..
బావ, బావమరుదులు మాట్లాడుతున్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యనించారు..
కేటీఆర్‌ వ్యాఖ్యలకు జనం నవ్వుకుంటున్నారని ఏద్దేవా చేశారు… కొందరు పెయిడ్ ఆర్టిస్టులు, యుట్యూబర్ల తో వెలుగుమట్ల వ్యవహారం పై రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు….వెలుగుమట్ల లో ఇండ్ల కూల్చివేతలపై ఆయన గురువారం స్పందించారు… రాష్ట్ర సచివాలయం లో మీడియాతో మాట్లాడారు.కేసీఆర్, హరీష్ రావు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై బీఆర్ఎస్ రాద్దాంతం చేస్తోందని మండిపడ్డారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రారంభించిందని.. తమ్మడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ కట్టాలని నిర్ణయించారని గుర్తు చేశారు. రూ.5600 కోట్లు తుమ్మడి హట్టికి ఖర్చు చేశామని తెలిపారు. కానీ బీఆర్ఎస్ స్వలాభం కోసం కాళేశ్వరం దగ్గర ప్రాజెక్ట్ కట్టిందని ఆరోపించారు.ఎనిమిదో వింత అంటూ బీఆర్ఎస్ గొప్పలు చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్ట్ మూడేళ్లలోనే కుప్పకూలిందని ఎద్దేవా చేశారు. లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో 4 ఏండ్లలో వాడింది కేవలం 112 టీఎంసీలు మాత్రమేనన్నారు.

మీడియా సమావేశం లో మాట్లాడుతున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here