పంట పొలాలకు నీళ్లు అందించండి…

భూపాలపల్లి నియోజకవర్గం లోని పలు సమస్యలపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అసెంబ్లీలో గళమెత్తారు.. ఇందిరరమ్మ ఇళ్లు, పంట పొలాలకు నీరు వంటి సమస్యలను తీర్చాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు…ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యి, బేస్మెంట్ నిర్మించిన తరువాత ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని నియోజకవర్గం లోని రాంపూర్,ఆజాంనగర్, నాగారం, నందిగామ, కమలాపూర్, ఆముదా లపల్లి,గ్రామాలలో ఈ సమస్య ఉందని ఎమ్మెల్యే వివరించారు… అలాగే నియోజకవర్గం లోని పంబాపూర్ గ్రామంలో బోర్లు, మోటార్లు వేసుకోకుండా పారెస్ట్ అధికాలు ఇబ్బంది పెడుతున్నారని అన్నారు… నీటి సమస్యపై సైతం మాట్లాడిన ఆయన నియోజకవర్గం లోని డి బి ఎం 31,38కాల్వ లకు నీరు రావడం లేదని దింతో మొగుళ్లపల్లి మండలం లోని పలు గ్రామాలు అలాగే శాయంపేట మండలం లోని పెద్దకోడెపాక, గోవిందాపూర్ గ్రామాల్లోని పంటపోలాలకు నిరందక పంట పొలాలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఈ సమస్యను సత్వరమే పరిష్కరించాలని ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు…

అసెంబ్లీలో మాట్లాడుతున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here