హాస్టల్ భోజనం లో బల్లి…
హన్మకొండ లోని ఓ ప్రయివేట్ హాస్టల్ భోజనంలో బల్లి రావడం తో హాస్టల్ లో ఉంటున్న విద్యార్థులు ఆందోళనకు గురైయ్యారు… భోజనం లో బల్లి వచ్చిన ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది… హన్మకొండ భీమారం లోని ఎస్ వీ ఎస్ కళాశాల సమీపంలో ఉన్న శశాంక బాయ్స్ హాస్టల్ లో గురువారం భోజనం లో బల్లి వచ్చింది దింతో ఒక్కసారిగా ఆందోళనకు గురైన హాస్టల్ విద్యార్థులు హాస్టల్ నిర్వాహకులకు చెప్పడంతో వారు విద్యార్థులను సముదాయించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది… ఇందుకు విద్యార్థులు ససేమిరా అని అధికారులకు పిర్యాదు చేయడంతో హాస్టల్ కు వచ్చి భోజనాన్ని పరిశీలించిన పుడ్ ఇన్స్పెక్టర్ హాస్టల్ నిర్వాహకులకు 15వేల రూపాయల జరిమాన విధించినట్లు సమాచారం.. కాగా ఈ హాస్టల్ ఎప్పుడు వివాదాస్పదంగానే కొనసాగుతున్నట్లు తెలిసింది… గతంలో గంజాయి విషయంలో పోలీసులు ఈ హాస్టల్ లో కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది…






