తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర కొత్త డీజీపీ గా సీవీ ఆనంద్‌ను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 1991 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన సీవీ ఆనంద్ ప్రస్తుతం హోం శాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఆయనను రాష్ట్ర పోలీసు శాఖ అత్యున్నత పదవికి నియమించారు. ప్రస్తుత డీజీపీ బి. శివధర్ రెడ్డి ఈ నెలాఖరుతో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, ఆయన స్థానంలో సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టనున్నారు. యూపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు అధికారుల పేర్లు పంపగా, అందులో ముగ్గురు అర్హుల పేర్లను యూపీఎస్సీ రాష్ట్రానికి సిఫార్సు చేసింది. ఆ జాబితాలో సీవీ ఆనంద్, వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్యా మిశ్రా పేర్లు ఉండగా, చివరకు ప్రభుత్వం సీవీ ఆనంద్ పేరును ఖరారు చేసింది.సీవీ ఆనంద్ గతంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా, యాంటీ కరప్షన్ బ్యూరో డైరెక్టర్ జనరల్‌గా, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా కీలక పదవులు నిర్వహించారు. పరిపాలన, శాంతిభద్రతల నిర్వహణలో ఆయనకు విశేష అనుభవం ఉంది. రాష్ట్ర పోలీసు వ్యవస్థను మరింత సమర్థంగా నడిపించగల అధికారి అనే పేరుతో ఆయన ఎంపికకు ప్రాధాన్యం లభించింది.ఈ నియామకంతో తెలంగాణ పోలీసు శాఖలో కీలక మార్పు చోటుచేసుకోగా, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, ఆధునిక పోలీసింగ్‌పై మరింత దృష్టి సారించే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.




