వరంగల్ సివిల్ సప్లై లో “రాణి గారి కాసుల వేట” బాగానే కొనసాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఉద్యోగ ధర్మంతో చేయాల్సిన పనిని పక్కనపెట్టి అక్రమంగా సంపాదించే అదనపు ఆదాయం పైనే ఇక్కడ పనిచేస్తున్న ఓ మహిళా అధికారి బాగానే దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.. తనకంటూ కొంతమందిని నియమించుకొని ఆ మహిళా అధికారి వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.. గతంలో తాను పనిచేసిన ఓ జిల్లా నుంచి ఓ ఇద్దరు వ్యక్తులను పిలిపించుకొని వారి చేత అప్పటినుంచి ఇప్పటివరకు అదే వసూళ్ల దందా కొనసాగిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.. మిల్లర్లు మొదలుకొని ఆ మిల్లర్లకు ధాన్యం కేటాయించే వరకు ప్రతి పనికి ప్రతిఫలంగా కావాల్సింది దండుకొని ఆ మహిళా అధికారి బాగానే వెనకేసినట్లు తెలుస్తోంది.. ఈ మహిళా అధికారి బాగోతం సివిల్ సప్లై శాఖలోని అధికారులు అందరికీ తెలిసిన గమ్మున ఉండటంలో ఆంతర్యమేంటో ఎవరికి అర్థం కావడం లేదు…
వరంగల్ సివిల్ సప్లై లో జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నించడానికో…వివరణ కోరడానికో ఆ మహిళా అధికారి వద్దకుఎవరైనా విలేకరి వెళితే చాలు అదేదో సినిమాలో ఓ క్యారెక్టర్ మాట్లాడినట్లు “జయ ఆంటీ మాలూమ్” అన్నట్లు నీకు ఆ నాయకుడు తెలుసా? ఈ నాయకుడు తెలుసా? ఆ పోలీస్ అధికారి తెలుసా? ఈ పోలీసు అధికారి తెలుసా? అంటూ ప్రశ్నించిన వారిని పరోక్షంగా ఆ మహిళా అధికారి బెదిరిస్తోంది….
వరంగల్ సివిల్ సప్లై లో కాసుల రాణి…
మిల్లర్ల కమిషన్ ఇవ్వకుండా సతాయింపు
తనకు కమిషన్ ఇవ్వాలని డిమాండ్…?
వరంగల్ సివిల్ సప్లై లో కాసుల వేట పై న్యూస్ 10 విశ్వసనీయ సమగ్ర కథనాలు…



