వసూళ్ల డి టి ఓ అతి…?

హన్మకొండ ఆర్ టి ఏ కార్యాలయంలో ఆ డి టి ఓ స్థాయి అధికారి తన ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి…కార్యాలయంలో రోజువారిగా తన అక్రమ వసూళ్ల దందా కొనసాగించడానికి ఓ ఏజెంట్ ను నియమించుకుని రెండు చేతులా సంపాదిస్తున్న ఈ అధికారి తన తోటి ఉద్యోగులను ఎవరిని లెక్కచేయని తనంతో షాడో డి. టి సి గా వ్యవహారిస్తున్నట్లు విమర్శలు జోరుగా వి నిపిస్తున్నాయి… కార్యాలయంలో వసూళ్లతో పాటు అన్ని వ్యవహారాలలో తానే జోక్యం చేసుకుంటూ అతిగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది..

వసూళ్లు ఆపేది లేదు…?

హనుమకొండ ఆర్టిఏ కార్యాలయంలో షాడో డిటిసి గా వ్యవహరిస్తున్న డి టి ఓ స్థాయి అధికారి వసూళ్లలో ఏమాత్రం తగ్గేది లేదంటూ తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నట్లు తెలియ వచ్చింది.. తనపై ఎన్ని వార్తా కథనాలు వచ్చిన లెక్క చేసేది లేదని బరాబర్ అక్రమ వసూళ్లు కొనసాగిస్తానని తెగేసి చెబుతున్నట్లు తెలిసింది.. ఎవరెన్ని వార్తా కథనాలు రాసిన తనకేమి కాదని ఆ డి టి ఓ స్థాయి అధికారి ధీమా వ్యక్తం చేసినట్లు తెలిసింది.. అంతేకాదు నిన్న మొన్నటివరకు అక్రమ వసూళ్ల కోసం అందరిని కార్యాలయం లోకి రానిచ్చిన సదరు డి టి ఓ స్థాయి అధికారి న్యూస్10 లో కథనం వెలువడగానే ఎవరు లోపలికి రావద్దని హుకుం జారీ చేసినట్లు తెలిసింది.. ఈ విషయంలో ఈ రోజు ఆ డి టి ఓ స్థాయి అధికారి కార్యాలయం లో  విధులు నిర్వహిస్తున్న హోమ్ గార్డు లను ఇష్టం వచ్చినట్లు తిట్టినట్లు తెలిసింది… అక్రమ వసూళ్లు ఆపని ఆ డి టి ఓ స్థాయి అధికారి త్తను మారకుండా “ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్లు” హోమ్ గార్డు లను బూతులు తిట్టడం విమర్శలకు దారి తీస్తుంది…ఇంతకీ ఈ డి టి ఓ స్థాయి అధికారి అడ్డగోలు అక్రమ వసూళ్ల వ్యవహారంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి…

ఆ కార్యాలయంలో అందరు అందరే…?

డి టి సి ఎం చేస్తున్నట్లు…?

…… మరో కథనం లో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here