ఏజెంట్లు రావొద్దు.. ఒక్క ఏజెంట్ చాలు

హన్మకొండ ఆర్ టి ఏ కార్యాలయంలో ఆ డి టి ఓ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు..కార్యాలయంలో అక్రమ వసూళ్ల వ్యవహారం పై న్యూస్10 వరుస కథనాలు వస్తున్న నేపథ్యంలో… ఏజెంట్లు గుట్టుచప్పుడు కాకుండా పనిచేసుకోవాలని, కార్యాలయానికి రాకుండా ఫోన్ లల్లో వ్యవహారం నడిపియాలని హుకుం జారీ చేసాడట… తన డ్రైవర్ తో ఏజెంట్లు అందరికి ఫోన్లు చేసి కార్యాలయానికి రాకండి… పైల్స్ పై ఇండికేషన్ స్టాంప్స్ వేయకండి. ఒక్కరోజు కమిషన్లు ఆపుదామని చెప్పించినట్లు తెలిసింది… అంతేకాదు పనిలోపనిగా కార్యాలయం విషయాలు తన వసూళ్ల బాగోతం ఎలా బయటకు వెళ్తుంది అని మళ్ళీ హోమ్ గార్డ్, కానిస్టేబుళ్ల పై విరుచుకుపడి డి టి ఓ బూతు పురాణం అందుకున్నట్లు తెలిసింది.. ఉద్యోగాలు ఊ డిపోతాయని పరిధి దాటి తిట్ల పురాణం అందుకున్నట్లు తెలిసింది…

ఒక్క ఏజెంట్ చాలు…

ఎజెంట్లు ఎవరు కార్యాలయానికి రావద్దని, తన డ్రైవర్ తో ఫోన్లు చేయించి హుకుం జారీచేసిన డి టి ఓ చాయ్ లు అమ్మే ఓ ఏజెంట్ తో కార్యాలయం లో ప్రస్తుతం పైల్స్ చక్కబెడుతున్నట్లు తెలిసింది.. అసలు ఏజెంట్ “సంతోషం”గా ఇంట్లోనుంచి కమిషన్ల పైల్స్ ఫోన్ లల్లో నడిపిస్తుంటే డి టి ఓ రెండో ఏజెంట్ తో పని కానిస్తున్నట్లు సమాచారం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here