కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో తాజా బదిలీలు, నియామకాల వ్యవహారం వైద్య వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. గతంలో సస్పెన్షన్ ఎదుర్కొన్న ఒక డాక్టర్‌కు మళ్లీ కీలక పదవి ఎలా దక్కిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిబంధనలు, సీనియారిటీ, అర్హతలను పక్కనపెట్టి ఆ డాక్టర్‌ను ప్రిన్సిపాల్‌గా నియమించారా..? ఈ నియామకం వెనుక తెరవెనుక చక్రం తిప్పిన శక్తులెవరు..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు, పదిహేనేళ్లకు పైగా ఒకేచోట పనిచేస్తున్న ఆ డాక్టర్ సతీమణికి ఇప్పటివరకు బదిలీ ఎందుకు కాలేదన్న ప్రశ్న కూడా వైద్య శాఖలో చర్చనీయాంశంగా మారింది. సాధారణ ఉద్యోగులకు వర్తించే బదిలీ నిబంధనలు ఇక్కడ ఎందుకు అమలు కాలేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఈ వ్యవహారం పై న్యూస్ 10 విశ్వసనీయ సంచలన కథనం సాయంత్రం సంచికలో



