ప్రజలకు సేవలు అందించాల్సిన రెవెన్యూ కార్యాలయం.. ఇప్పుడు వసూళ్ల కేంద్రంగా మారిందా..? ఆ మండల రెవెన్యూ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ డిప్యూటీ తహశీల్దార్‌పై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. సొంత శాఖ ఉద్యోగుల నుంచే ఎస్‌ఆర్‌లు (సర్వీస్ రికార్డులు) రాయడం, ఇతర పరిపాలనా పనుల కోసం భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డబ్బులు తీసుకున్నప్పటికీ పనులు పూర్తి చేయకుండా నెలల తరబడి తిప్పించుకుంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వసూళ్ల వ్యవహారంలో ఆరితేరిన ఈ అధికారి వెనుక మరెవరి అండదండలు ఉన్నాయన్న చర్చ రెవెన్యూ వర్గాల్లో సాగుతోంది. కార్యాలయంలో అసలు ఏం జరుగుతోంది..? పరకాల రెవెన్యూ డివిజన్ లోని భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన ఆ మండల రెవెన్యూ కార్యాలయం లో డి టి మేడం మహా వసూళ్ల పై న్యూస్ 10విశ్వసనీయ కథనం సాయంత్రం సంచికలో….



