వెలికట్ట లో వెంచర్ దందా

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్టె గ్రామంలో ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ రియల్ ఎస్టేట్ దందా సాగుతోందన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గ్రామ రెవెన్యూలోని సర్వే నెం.143లో డీటీసీపీ, గ్రామ పంచాయతీ తదితర కీలక అనుమతులు లేకుండానే కేవలం నాలా కన్వర్షన్ ఆధారంగా హద్దురాళ్లు పాతి, గృహ నిర్మాణాలకు సిద్ధమైన వెంచర్‌గా ప్రచారం చేస్తూ ప్లాట్ల విక్రయాలకు తెరలేపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీ ఎన్ కే ఇన్ఫ్రా డెవలపర్స్ పేరుతో రంగురంగుల బ్రోచర్లు, ఆకర్షణీయ ప్రకటనల ద్వారా అమాయక ప్రజలను ఆకట్టుకుని నాన్-లేఔట్ ప్లాట్లను విక్రయిస్తున్నారని, ఇప్పటికే సగానికి పైగా ప్లాట్లు విక్రయించి భారీగా సొమ్ము చేసుకున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో గృహ నిర్మాణ అనుమతులు, రిజిస్ట్రేషన్, ఇతర చట్టపరమైన సమస్యలు తలెత్తితే బాధ్యత ఎవరు వహిస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే వెంచర్ కార్యకలాపాలు బహిరంగంగా కొనసాగుతున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి వెంచర్ చట్టబద్ధతపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ దందా తీరు…!!

తొర్రూరు లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. కాస్త ఖాళీ జాగా కనిపిస్తే చాలు గుద్దల్లా వాలిపోతూ రియల్ వ్యాపారాన్ని షురూ చేస్తున్నారు.ప్రభుత్వ అనుమతులు ఏమి లేకున్నా నాలుగు హద్దురాళ్ళు ,చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి రెడీ ఫర్ సేల్ అంటూ అమాయకులకు వల విసురుతూ మాయమాటలు చేప్పి ప్లాట్లు అంటగట్టి వారిని బుట్టలో వేసుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. సరిగ్గా ఇదే కోవాకు చెందిన ఓ రియల్ కధ ఇది…మానుకోట జిల్లా తొర్రూరు రెవెన్యూ డివిజన్లలోని వెలికట్టె గ్రామ పంచాయితీ లోని సర్వే నెంబర్ 143లో తాజాగా ఓ రియల్ వ్యాపారానికి కొంతమంది బడా బాబులు తెరలేపారు. అమాయకులే టార్గెట్ గా నాన్ లే అవుట్ వెంచర్ వేసి ప్లాట్ల అమ్మకానికి సిద్ధమయ్యారు. కేవలం నాలా కన్వర్షన్ మాత్రమే చేసి ఎలాంటి గ్రామ పంచాయితీ,డీటీసీపీ అనుమతులు లేకుండా రంగు రంగుల కరపత్రాలు ప్రచురించి అతి తక్కువ ధరలో ఇండ్ల స్థలాలు అంటూ ప్రచారం చేస్తూ సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.నాన్ లే అవుట్ ప్లాట్లను అతి తక్కువ ధరకు ఆశపడి కొన్న అమాయకులకు భవిష్యత్తులో ఇంటి, ఇతర నిర్మాణాల అనుమతి విషయంలో వచ్చే ఇబ్బందుల విషయంలో బాధ్యులు ఎవరనేది అసలు ప్రశ్న..
అసలు గ్రామ పంచాయితీ ,డీ టీ సీ పీ అనుమతులు ఉన్నాయా లేవా అన్న విషయం పక్కన పెడితే లే అవుట్ అంటూ ప్రచారం చేస్తున్న వ్యాపారులే లే అవుట్ నిబంధనలు పాటించకపోవడం ఏంటన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం అటు వైపు కన్నెత్తి చూడక పోవడం ,ఇప్పటికే భూ వ్యాపారులు సగానికి పైగా ప్లాట్లు అమ్మడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో మరి వారికే తెలియాలి.
వేచి చూడాలి మరి అసలు అధికారులు ఏ విధంగా స్పందించి చర్యలకు సిద్ధపడుతారో….

వెలికట్ట లో వెంచర్ దందా- news10.app
వెలికట్ట లో వెంచర్ దందా- news10.app
వెలికట్ట లో వెంచర్ దందా- news10.app
వెలికట్ట లో వెంచర్ దందా- news10.app

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here