మీరే క్లోజ్ చేయండి…?

30 వేల దాన్యం బస్తాల మాయంపై సివిల్ సప్లై శాఖలో తీవ్ర కలకలం రేగింది. పంచనామా నిర్వహించి సీజ్ చేసిన ధాన్యం అదృశ్యమైన వ్యవహారాన్ని “మీరే క్లోజ్ చేయండి” అంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు అదనపు కలెక్టర్‌పై ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే హనుమకొండ డీసీఎస్‌వో మాత్రం ససేమిరా అంటుండటంతో వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. “సీజ్ చేసిన ధాన్యాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఎలా అప్పగించారు?” అంటూ డీసీఎస్‌వో ఎదురుప్రశ్నించగా, కార్యాలయంలోనే ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. తన నిర్ణయాల వల్ల తలెత్తిన వివాదాన్ని ఇతర అధికారులపై నెట్టివేసే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతుండగా, ఈ వ్యవహారం మధ్యలోనే ఉన్నతాధికారి తీరుతో విసిగిన డీసీఎస్‌వో సెలవుపై వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది…

న్యూస్ 10 అందిస్తున్న పూర్తి సంచలన విశ్వసనీయ కథనం సాయంత్రం సంచికలో….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here