లాసెట్‌లో మావోయిస్టు మాజీ అగ్రనేత సత్తా

349వ ర్యాంకు సాధించిన దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి

హైదరాబాద్: తెలంగాణ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (లాసెట్)–2026 ఫలితాల్లో మావోయిస్టు మాజీ అగ్రనేత దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ప్రతిభ చాటారు. ఐదేళ్ల న్యాయ విద్య కోర్సులో ప్రవేశం కోసం నిర్వహించిన లాసెట్ పరీక్షలో ఆయన 349వ ర్యాంకు సాధించారు.గురువారం విడుదలైన ఫలితాల ప్రకారం దేవ్‌జీ 57 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 349వ ర్యాంకును కైవసం చేసుకున్నారు. గతంలో మావోయిస్టు ఉద్యమంలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన, సాధారణ జీవితంలోకి వచ్చాక విద్యాభ్యాసంపై దృష్టి సారించడం విశేషంగా నిలిచింది.సమాజ ప్రధాన స్రవంతిలోకి చేరిన అనంతరం ఉన్నత విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో లాసెట్ పరీక్షకు హాజరైన దేవ్‌జీ, మంచి ర్యాంకు సాధించడం పట్ల పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు..విద్య ద్వారా జీవితాన్ని కొత్త దిశగా మలుచుకోవచ్చనే సందేశాన్ని ఆయన విజయం మరోసారి చాటిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. న్యాయ విద్యను అభ్యసించి సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here