అంతా సిండికేట్…?

వరంగల్ పోచమ్మ మైదాన్ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో అంతా సిండికేట్ రాజ్యమేనా..? అధికారిక సేవల కోసం వచ్చే ప్రజల కంటే కొందరు డాక్యుమెంట్ రైటర్లకే అక్కడ ఎక్కువ ప్రాధాన్యం దక్కుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యాలయంలోని ప్రతి వ్యవహారంపై కొందరు డాక్యుమెంట్ రైటర్లే పెత్తనం చెలాయిస్తున్నారని, వారికి అక్కడి అధికారుల అండదండలు ఉన్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. “నేను చెప్పిందే ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రార్ చెప్పినట్లే” అంటూ ఓ డాక్యుమెంట్ రైటర్ బహిరంగంగా వ్యాఖ్యానించడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. యధా రాజా తథా ప్రజా అన్నట్లుగా కొందరు డాక్యుమెంట్ రైటర్లు వ్యవహరిస్తుండగా, “అంతా సారే చూసుకుంటాడు” అన్న ధీమాతో నిబంధనలను పక్కనబెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ కార్యాలయం కొందరి గుప్పెట్లో నడుస్తోందా..? అన్న ప్రశ్న తలెత్తుతుంది.

ప్రభుత్వ  కార్యాలయాలు ప్రజలకు సేవలు అందించేందుకు ఏర్పాటు చేసినవే. అయితే వరంగల్‌లోని పోచమ్మ మైదాన్ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కార్యాలయంలో అధికారిక వ్యవహారాల కంటే కొందరు డాక్యుమెంట్ రైటర్ల హవానే ఎక్కువగా కనిపిస్తోందని ప్రజలు, రిజిస్ట్రేషన్ సేవల కోసం వచ్చే పలువురు ఆరోపిస్తున్నారు.

రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏ పని చేయాలన్నా కొందరు డాక్యుమెంట్ రైటర్ల ద్వారానే జరగాల్సి వస్తోందని, వారి అనుమతి లేకుండా ఫైళ్లు ముందుకు కదలవన్న అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతోంది. కార్యాలయంలోకి వచ్చే సాధారణ ప్రజలకు ఒక విధానం, సిండికేట్‌కు చెందిన వ్యక్తులకు మరో విధానం అమలవుతోందన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.ఈ వ్యవహారంలో మరింత సంచలనంగా మారిన అంశం ఏమిటంటే, ఓ డాక్యుమెంట్ రైటర్ “నేను చెబితే ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రార్ చెప్పినట్లే” అంటూ బహిరంగంగా వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కార్యాలయంలో అసలు అధికారం ఎవరి చేతుల్లో ఉందన్న అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఒక సాధారణ డాక్యుమెంట్ రైటర్‌కు ఇంత ధైర్యం ఎలా వచ్చిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కార్యాలయంలోని కొందరు డాక్యుమెంట్ రైటర్లు అధికారుల పేర్లను ఉపయోగిస్తూ ప్రజలపై ప్రభావం చూపుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. “అంతా సారే చూసుకుంటాడు”, “మేము చెప్పిందే జరుగుతుంది” అనే ధీమాతో వ్యవహరిస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వ కార్యాలయం కొందరి వ్యక్తిగత ఆధిపత్యానికి కేంద్రంగా మారిందా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఇక కార్యాలయంలో పనిచేసే కొందరు సిబ్బంది కూడా ఈ సిండికేట్ ప్రభావానికి లోనవుతున్నారన్న ప్రచారం సాగుతోంది. ప్రజలు నేరుగా అధికారులను కలిసే అవకాశం లేకుండా మధ్యవర్తుల వ్యవస్థ బలపడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా రిజిస్ట్రేషన్ కోసం వచ్చే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.

“యధా రాజా తథా ప్రజా” అన్న సామెతను గుర్తు చేసే విధంగా కార్యాలయంలోని కొందరు డాక్యుమెంట్ రైటర్ల ప్రవర్తన ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటమే ఈ పరిస్థితులకు కారణమన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇది కేవలం పరిపాలనా వైఫల్యం మాత్రమే కాకుండా ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే అంశమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.ఇప్పటికే ఈ కార్యాలయానికి సంబంధించిన పలు అంశాలు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో, తాజా ఆరోపణలు మరింత చర్చకు దారి తీస్తున్నాయి. కార్యాలయంలో నిజంగానే డాక్యుమెంట్ రైటర్ల సిండికేట్ ? అధికారుల అండదండలు ? ప్రజలపై ఒత్తిడి తెచ్చే పరిస్థితులు ? అనే అంశాలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు స్పందించాల్సి ఉంది. వాస్తవాలు ఏంటో వెలుగులోకి వస్తేనే పోచమ్మ మైదాన్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరుగుతున్న వ్యవహారాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.అంతేకాదు ప్రస్తుతం ఇక్కడ ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న ఓ సీనియర్ అసిస్టెంట్ తన శాయశక్తుల డాక్యుమెంట్ రైటర్ల,, ఎజెంట్ల వ్యవస్థకు బలం చేకూరుస్తూ సహకరిస్తున్నాడని బలమైన ఆరోపణలు సైతం ఉన్నాయి… ఇక్కడ ఉన్న డాక్యుమెంట్ రైటర్లను అందరిని సిండికెట్ చేసి రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో వారికీ అధిక ప్రాధాన్యత ఇస్తూ వారికి రెడ్ కార్పేట్ పరిచి కార్యాకాయంలోకి ఆహ్వానిస్తూ చిటికెలో పనులు చేసిపెడుతూ అందినకాడికి దండుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here