ఏసీబీ కి చిక్కిన ఎం పి డి ఓ

ఏసీబీ వలలో ఎం పి డి ఓ

నర్సింహులపేట ఎంపీడీవో కార్యాలయంలో ఏసీబీ దాడులు..

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన దాడుల్లో ఎంపీడీవో రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్యతో పాటు ఎంపీడీవో కుమారుడు రాంప్రసాద్ కూడా చిక్కినట్లు సమాచారం..పడమటి గూడెం గ్రామ పరిధిలో ఓ వెంచర్‌కు అనుమతులు మంజూరు చేసే విషయంలో లక్ష రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ఉచ్చుపన్ని, రూ.45 వేల లంచం తీసుకుంటున్న సమయంలో సంబంధిత అధికారులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలుస్తోంది.ఈ వ్యవహారంలో ఎంపీడీవో కార్యాలయానికి సంబంధించిన అనేక పనులను అధికారిక హోదా లేకపోయినా ఎంపీడీవో కుమారుడు రాంప్రసాద్ చక్కబెడుతున్నాడనే ఆరోపణలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. కార్యాలయానికి వచ్చే ప్రజలు, అనుమతుల కోసం వచ్చే దరఖాస్తుదారులతో నేరుగా వ్యవహరిస్తూ కీలక పాత్ర పోషిస్తున్నాడనే విమర్శలు ఉన్నాయి.ఏసీబీ దాడుల సందర్భంగా రాంప్రసాద్ పాత్రపై కూడా అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. వెంచర్ అనుమతి ప్రక్రియలో అతని ప్రమేయం ఎంత వరకు ఉందనే కోణంలో విచారణ కొనసాగుతోంది.కాగా, పట్టుబడిన నగదు, సంబంధిత పత్రాలు, అధికారుల వాంగ్మూలాలను సేకరించిన ఏసీబీ అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో మరికొందరి పాత్ర ఉందా అనే అంశంపై కూడా విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here