రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్.. మూడు నెలలు ఇరిగేషన్ శాఖ అప్పగించు !

  • “మూడు నెలల్లోనే రైతుల పొలాలకు నీళ్లు ఎలా తీసుకురావాలో చూపిస్తా”
  • “విఫలమైతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా” అంటూ మాజీ మంత్రి హరీష్ రావు సవాల్

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు టి. హరీష్ రావు సంచలన సవాల్ విసిరారు. రాష్ట్ర ఇరిగేషన్ శాఖను కేవలం మూడు నెలల పాటు తనకు అప్పగిస్తే, రైతుల పొలాలకు నీళ్లు ఎలా తీసుకురావాలో చేసి చూపిస్తానని అన్నారు.

ప్రస్తుత ప్రభుత్వం నీటి వనరులను సక్రమంగా వినియోగించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించిన ఆయన, గోదావరిలో సమృద్ధిగా నీరు ఉన్నప్పటికీ ఎత్తిపోతల ప్రాజెక్టులను సమర్థంగా వినియోగించడం లేదని ఆరోపించారు.

“ఒక్క మూడు నెలలు ఇరిగేషన్ శాఖ బాధ్యతలు నాకు ఇవ్వండి. రాష్ట్రంలోని ప్రాజెక్టులను సమర్థంగా నిర్వహించి నీటిని రైతులకు అందిస్తాను. ఒకవేళ నేను చెప్పినట్లుగా నీళ్లు తీసుకురాలేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను” అని హరీష్ రావు సవాల్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here