కడియం దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకో…!!

లేకపోతే రాజకీయాలకు రాజీనామా చేయి” – కడియంపై మంత్రి కొండా సురేఖ ఫైర్

కడియం శ్రీహరిపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించిన మంత్రి కొండా సురేఖ

టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌ గౌడ్‌ను కలిశా.. 14న మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేస్తానని వెల్లడి

కాంగ్రెస్ టికెట్‌పై మళ్లీ గెలిచి చూపించాలి” అంటూ కడియంకు సవాల్..

    స్టేషన్‌ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే పదవిలో ఇమడలేకపోతే దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలని, అది సాధ్యం కాకపోతే రాజకీయాలకు రాజీనామా చేసి ఇంట్లో పడుకో వాలని ఘాటుగా వ్యాఖ్యానించారు.

    కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాతే వివాదాలు మొదలయ్యాయని మంత్రి ఆరోపించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే ఆయన సాధారణ ఎమ్మెల్యేగా ఉండలేకపోతున్నారని విమర్శించారు.

    కడియం శ్రీహరికి నిజాయితీ ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మళ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి చూపించాలని మంత్రి సురేఖ సవాల్ విసిరారు.

    కడియం శ్రీహరి వ్యవహారంపై ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌ను కలిసి ఫిర్యాదు చేశానని, ఈ నెల 14న కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ను కూడా కలిసి పూర్తి వివరాలు తెలియజేస్తానని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు.

    మంత్రి వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ–కడియం శ్రీహరి మధ్య కొనసాగుతున్న రాజకీయ విభేదాలు మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here