“‘అరేయ్ బుర్ర తక్కువోడా..’ ఖమ్మం సభలో సీఎం రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు”
ఖమ్మంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మేడిగడ్డ బ్యారేజ్ అంశాన్ని ప్రస్తావిస్తూ, ప్రతిపక్ష నాయకుల వ్యాఖ్యలకు తిట్లతో సమాధానం చెప్పారు…
మేడిగడ్డలో నీటిని నిల్వ చేయాలన్న డిమాండ్లపై స్పందించిన సీఎం, “అరేయ్ బుర్ర తక్కువోడా… మేడిగడ్డలో నీళ్లు నిలిపితే అది కొట్టుకుపోయి భద్రాచలం రాముడే కొట్టుకుపోతాడురా” అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా “దుర్మార్గుడా” అంటూ తీవ్ర పదజాలం ఉపయోగిస్తూ కేసీఆర్, కేటీఆర్‌లను లక్ష్యంగా చేసుకున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోపాల వల్లే మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతిందని కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచే చెబుతోందని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రతే ప్రభుత్వానికి ముఖ్యమని, సాంకేతిక నిపుణుల సూచనల మేరకే నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు.
సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.



