నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇక లేరు

ముంబై: విలక్షణ నట ప్రయాణం అర్ధాంతరంగా ఆగిపోయింది.అనేకరకాల పాత్రలతో అలరించిన నటుడు ఇక సెలవంటు వెళ్ళిపోయాడు. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్(54) కన్నుమూశారు. కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన ముంబై కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇర్ఫాన్ కన్నుమూతతో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఇర్ఫాన్‌కు ఒకసారి జాతీయ పురస్కారం, 4 సార్లు ఫిలింపేర్ అవార్డులు దక్కాయి.

ఇర్ఫాన్ తల్లి సైదా బేగం మూడు రోజుల క్రితం చనిపోయారు. జైపూర్‌లో తల్లి అంత్యక్రియలకు ఇర్ఫాన్ హాజరుకాలేకపోయారు.