వరంగల్ ఆర్టీఏ అధికారుల నిర్వాకం… నంబర్ ఒక్కటే వాహనాలు రెండు…

వాహనం కొనుగోలు చేసాక రిజిస్ట్రేషన్ చేయించటం తప్పనిసరి… కానీ ఒకే నంబర్ రెండు వాహనాలకు ఉంటే ఎలా ఉంటుంది… గుట్టు చప్పుడు కాకుండా రవాణా శాఖ సిబ్బంది వేరే జిల్లా వాహనానికి మన నంబర్ కేటాయిస్తే ఎలా ఉంటుంది… సరిగ్గా ఇలాగే జరిగింది వరంగల్ రవాణాశాఖ కార్యాలయంలో ఒక వాహనానికి కేటాయించిన నంబర్ ను నిజామాబాద్ లో ఉన్న మరో వాహనానికి కేటాయించిన అధికారులు అసలు వాహనదారునికి చుక్కలు చూపెడుతున్నారు… రేపు మాపు అంటూ వాహనదారున్ని కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. వాహనదారున్ని తప్పుత్రోవ పట్టించి అధికారులు ఆ రిజిస్ట్రేషన్ ని ఇతర జిల్లాకు మార్చటం వింటే అశ్చర్యం కలుగుతుంది… ఈ సమస్య పరిష్కారం కోసం బాధితుడు నెలల కొద్దీ కాదు గత రెండు సంవత్సరాలుగా బాధితుడు వాహన టైర్లు అరిగేలా కార్యాలయం చుట్టూ తిరిగినప్పటికి ఫలితం లేకుండా పోయింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం

వరంగల్ ఆర్టీఏ అధికారుల నిర్వాకం... నంబర్ ఒక్కటే వాహనాలు రెండు...- news10.app

ఇది అధికారుల నిర్వాకం..

హన్మకొండకు చెందినదొంతు రాంరెడ్డి 2009 వ సంవత్సరంలో బ్యాంక్ లోను ద్వారా ఓ ఇన్నోవా వాహనాన్నికొనుగోలు చేసాడు. ఆ వాహనం ఫైనాన్స్ తీరిపోయాక వాహనానికి సంబందించిన అసలు పత్రాలు తీసుకున్నాడు. కొన్ని రోజుల తరువాత అతనికి తరుచుగా నిజామాబాద్ నుంచి చలానాలు రావడం మొదలైయింది… తాను నిజామాబాద్, హైదరబాద్ వెళ్ళకుండానే చలానాలు అధిక సంఖ్యలో వస్తుండడంతో రాంరెడ్డి కి అనుమానం వచ్చింది. తన వాహనం నిజామాబాద్ వెళ్ళకుండానే చలాన రావడం అదెలా సాధ్యమని ఆన్ లైన్ లో చూస్తే అతని వాహనం నంబర్ పైనే మరో వాహనం నిజామాబాద్ కి చెందిన వ్యక్తి పేరు పై పై రిజిస్ట్రేషన్ అయిందని తెలిసి ఖంగుతిన్నాడు. దింతో పూర్తి వివరాలకోసం, పేరు మార్పు కొరకు అప్లికేషన్ పెట్టుకున్నాడు. కొద్ధి రోజులు తిరిగాక మెల్లగా వివరాలు ఇచ్చిన అధికారులు నిజమాబాద్ లోని నన్నపు యతిరాజ్ పేరు పై రిజిస్ట్రేషన్ అయి ఉందని చెప్పారు. దింతో అసలు వాహానదారుడైన రాంరెడ్డి ఒక్కసారిగా ఆందోళనకు గురైయ్యాడు. ఆలా ఎలా పొరపాటు చేస్తారని అధికారులను నిలదీసాడు.

తాను అనుమతి కొరకు అప్లికేషన్ పెట్టినప్పుడు అందుకు సంబందించిన సిసి ని నిజమాబాద్ కి బదిలీ చేసారని తెలుసుకున్నాడు. అప్పటి నుండి నేటి వరకు తన వాహనానికి సంబందించిన పత్రాలకోసం రోజు తిరుగుతున్నప్పటికి అధికారులు పట్టించుకోవటం లేదని బాధితుడు అన్నారు. ఈ విషయం పై ఉన్నతధికారులకు పిర్యాదు చేయగా నిజమాబాద్ కి సంబందించిన వాహనాన్ని సీజ్ చేసి హైదరాబాద్ లో మైల దేవరపల్లి స్టేషన్ లో పెట్టామని అంటున్నారు కానీ వాహన కాగితాలు తన పేరు పై బదిలీ చేసి ఇవ్వండని కోరగా ఇపుడు అప్పుడు అని రెండు సంవత్సరాల నుండి చెప్పులరిగేలా తిరుగుతున్నా… అధికారులు మాత్రం ఎదో ఒకటి చెప్పి దాటవేస్తున్నారని రాంరెడ్డి వాపోయాడు.

ఒకే నంబర్ రెండు వాహనాలకు కేటాయించడం లాంటి తతంగం అంత కేవలం కార్యాలయం సిబ్బంది మాత్రమే చేయగలుగుతారని మరెవ్వరికి సాధ్యం కాదని ఆయన అన్నారు. ఈ విషయం బయటకు పొక్కకుండా అధికారులు ప్రయత్నం చేస్తున్నారని… ఎక్కడికి వెళ్లిన నీ పని ఎవరు చేయరు అని అధికారులు బెదిరిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తంచేశాడు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి తనకు న్యాయం చేసి వాహన ఒరిజినల్ పత్రాలు ఇప్పించి న్యాయం చేయాలని రాంరెడ్డి కోరారు.

కార్యాలయంలో ఫైల్ మాయం…?

ఒకే నంబర్ పై రెండు వాహనాలు ఉండడంతో అసలు వాహనదారుడు వరంగల్ రవాణాశాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న పని కావడం లేదు. గత రెండు సంవత్సరాలుగా రవాణా శాఖ అధికారిని కలిసిన పని చేయకుండా ఏవో మాటలు చెప్పి పంపిస్తున్నారు తప్ప పనిమాత్రం చేయడం లేదు. ఇలా ఒకే నంబర్ పై రెండు వాహనాలు ఉండడం వెనుక ఇక్కడి కార్యాలయ సిబ్బంది చేతివాటమేనని ఆరోపణలు వస్తున్నాయి. ఈ పని చేసిన ఓ ఉద్యోగి వాహనానికి సంబందించిన పైల్ ను సైతం మాయం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.అందుకే ఈ విషయంలో రవాణాశాఖ అధికారి సైతం ఏంచేయలేక పోతున్నాడని గత రెండు సంవత్సరాలుగా అధికారులు పైల్ కోసం వెతుకుతున్న లాభం లేకుండా పోయిందని తెలిసింది.అందుకే బాధితుడు కార్యాలయం చుట్టూ,అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం తప్పడం లేదని సమాచారం.