‘అమ్మ’ రాజ కుమారా…!

ఆమె..అతడు మధ్యలో నిరుద్యోగులు
ఉద్యోగాలపేరుతో నిరుద్యోగ జీవితాలతో చెలగాటం
ఒక్కో నిరుద్యోగి వద్ద 4లక్షలు వసూలు చేసిన వైనం
మెక్కిన సొమ్ము 2 కోట్లకు పైగానే
ఆమెకు ఇచ్చానని ఆతడు ….అతడే ఇస్తాడని ఆమె
రెండు సంవత్సరాలుగా నిరుద్యోగులను తిప్పుకుంటున్న వైనం
ఆమె భాగోతం బయటపెడతానంటున్న అతడు…ఆమెకే రెండు కోట్లు ఇచ్చానని ఒప్పుకోలు

“అమ్మ” భాగోతం-2

ఆమె ఓ ఆశ్రమ నిర్వహకురాలు, కొంత మంది అనాధలు, వృద్ధులను చేరదీసి సపర్యలు చేస్తున్న మానవతావాది అని అందరూ చెప్తుంటారు. ఏ దిక్కు లేని అనాధలు కాలం చేస్తే తానే పెద్ద దిక్కు అయి తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించిన గొప్ప మనసున్న “అమ్మ”ఇదంతా బాగానే ఉంది. సేవ ట్రాక్ రికార్డ్ ఘనంగానే ఉంది సేవ పరంగా ఎంతటి ఘనకీర్తి ని సంపాదించి ట్రాక్ రికార్డ్ నెలకొల్పిందో మోసం చేయడంలోనూ అంతే రీతిగా ఆరి తేరినట్లు ఆరోపణలు వెల్లు వెల్లువెత్తుతున్నాయి . ఉద్యోగాల పేరుతో ఓ మధ్యవర్తిని పెట్టీ అతని ద్వారా 2 కోట్ల రూపాయల కు పైగా వసూలు చేసినట్లు బాధితులు చెప్తున్నారు.'అమ్మ' రాజ కుమారా...!- news10.app ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి 84 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర 4 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ఇంత పెద్ద మొత్తంలో వసూలు చేసిన వీరు ఉద్యోగాలు ఇప్పించలేదు. పైగా చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వమంటే తనకేం తెలియదని ఆశ్రమ నిర్వాహకురాలు, తనకు ఏ పాపం తెలియదని మధ్యవర్తి తప్పించుకు తిరుగుతున్నాడు. గత రెండు సంవత్సరాలుగా డబ్బుల కోసం వారి చుట్టూ తిరిగిన ఎంతకూ డబ్బులు రాకపోవడంతో న్యూస్_10 ను ఆశ్రయించారు బాధిత నిరుద్యోగులు. తమకు జరిగిన మోసం గూర్చి పూసగుచ్చినట్లు చెప్పారు. అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను అందించారు.

ఇద్దరూ మోసం చేయడంలో దిట్ట…

అమ్మ అనాధ వృద్ధాశ్రమం నడుపుతున్న శ్రీదేవి అలియాస్ అమ్మ శ్రీదేవి, ఆశ్రమం నేనే నడుపుతున్న కర్త కర్మ క్రియ నేనే అని అని చెప్పుకొని తిరిగే రాజ్ కుమార్ నిరుద్యోగులను నిలువునా ముంచారు. తన పరిచయాలతో ఎవరినైనా నమ్మించవచ్చనే ఉద్దేశంతో ఆశ్రమాన్ని నిరుద్యోగులను బురిడీ కొట్టించి నిండా ముంచెందుకు ఉపయోగించినట్లు బాధితులు తెలిపారు. అసలే అమ్మ శ్రీదేవి సేవా అంటూ చెప్పే నాలుగు నీతి మాటలు, ఆశ్రమానికి వచ్చి పోయె పెద్ద పెద్ద అతిథులు ఇవన్నీ చూసి తాము పూర్తిగా నమ్మి లక్షల రూపాయలు ముట్టాజెప్పామని లబోదిబో మంటున్నారు. ఆశ్రమంలోనే తనకు ఓ గది ని ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించే రాజ్ కుమార్ అంతా “అమ్మ”చూసుకుంటుందని నమ్మ బలికే వాడని వారు అన్నారు. డబ్బులు చెల్లించే టప్పుడు ఆశ్రమం కాకుండా బయట ఎక్కడన్నా కలిస్తే “అమ్మ శ్రీదేవి” కారులో ఉంటే రాజ్ కుమార్ డబ్బు మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపోయేవా రట. ఈ సీన్ లోకి ఎంటర్ కాకుండా శ్రీదేవి అలియాస్ అమ్మ శ్రీదేవి చాలా జాగ్రత్తలు తీసుకునేదన్నమాట. డబ్బులు తీసుకునే రాజ్ కుమార్ సైతం డబ్బు మొత్తాన్ని సరిచూసుకోమన్న, లెక్కపెట్టమన్న నాలుగు లక్షలు ఉన్నాయి….. కదా మీపై నమ్మకం ఉందని కెమెరాకు కూడా దొరకని వేగంతో తుర్రుమనేవాడట. ఇలా వరంగల్ జిల్లాలోని హన్మకొండ, రేగొండ, గొర్రె కుంట, హైదరాబాద్ ప్రాంతాల నుండి సుమారు 88 మంది దగ్గర నుంచి రెండున్నర కోట్లకు పైగా వసూలు చేశారు.

నకిలీ ఆర్డర్ పత్రాలు…

'అమ్మ' రాజ కుమారా...!- news10.app

డబ్బులు అందజేసిన నిరుద్యోగులు తమ ఉద్యోగం ఏదని రాజ్ కుమార్ ను నిలదీస్తే విషయం ఎక్కడ బయటికి పొక్కుతుందో నని భయంతో నకిలీ అప్పాయింట్ మెంట్ ఆర్డర్లు తయారు చేసి భాదితులకు అందజేశాడట. రవాణా శాఖలో ఉద్యోగ వచ్చిందని నకిలీ పత్రాలను సదరు నిరుద్యోగులకు ఇద్దరు కలిసి శుభాకాంక్షలు సైతం తెలిపారట. మోసంలో ఆరితేరిన వీరు ఆర్డర్ పత్రాలు సరే ఎప్పుడు ఉద్యోగంలో జాయిన్ కావాలని అడిగితే యస్ బి, ఐబీ, ఎంక్వైరీ జరుగుతుందని ఇంకొద్ది రోజులు ఓపిక పట్టాలని నిరుద్యోగులకు సర్ది చెప్పేవారట. ఆ సమయం కూడా గడవటం నకిలీ ఆర్డర్ల విషయం బయట పడటంతో అసలు గుట్టు రట్టయింది ఇక చేసేది లేక తీసుకున్న డబ్బు చెల్లిస్తామని నమ్మబలికారు. డబ్బు ఇస్తామని చెప్పారు కానీ రెండు సంవత్సరాలుగా తిప్పించుకుంటూనే ఉన్నారు. రేపు మాపు అంటూ వెంట తిప్పుకుంటున్నారు, కానీ చిల్లి గవ్వ ఇప్పటి వరకూ చెల్లించింది లేదు. పైగా నిరుద్యోగులు ప్రశ్నిస్తే దబాయిస్తున్నారు. ఆమె ఇస్తుందని అతడు…… అతడే ఇస్తాడని ఆమె… తప్పించుకు తిరుగుతున్నారని భాదితులు ఆరోపిస్తున్నారు .

ఎవరీ రాజ్ కుమార్…..?

జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని అన్సాన్ పల్లి గ్రామానికి చెందిన రాజ్ కుమార్ కమాండో పని చేసి పదవి విరమణ చేశాడు. ఆ తర్వాత బౌన్సర్ లను అందించే కన్సల్టెన్సీ ప్రారంభించాడు .తన కున్న పరిచయాలతో అమ్మ అనాధ వృద్ధాశ్రమంతో పరిచయాలు పెంచుకుని నిర్వాహకురాలుకి దగ్గరయ్యాడు. ఈ పరిచయంతో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులకు చెప్తూ అందినకాడికి దం దుకోవడం అలవాటు చేసుకున్నాడు. సంఘంలో తానొక పేరు ప్రతిష్టలు, అనేక పరిచయాలు ఉన్న వ్యక్తి నంటు చెప్పుకునే రాజ్ కుమార్ మోసం చేయడం లో ఆరితేరాడని బాధితులు ఆరోపిస్తున్నారు

భార్య భర్తల మని నమ్మించారు: బాధిత నిరుద్యోగి మనోజ్'అమ్మ' రాజ కుమారా...!- news10.appఅమ్మ శ్రీదేవి, రాజ్ కుమార్ తామిద్దరం భార్య, భర్తలం అని చెప్పి నమ్మించి తన వద్ద ఉద్యోగం ఇప్పిస్తామని 4 లక్షల రూపాయలు వసూలు చేశాడని గొర్రె కుంట కు చెందిన మనోజ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఉద్యోగాలు ఇప్పిస్తామని దాదాపు ఒక్కొక్కరి దగ్గర 4 లక్షల రూపాయలు 88 మంది దగ్గర ఇద్దరు కలిసి వసూలు చేశారని రవాణా శాఖలో బ్యాక్ లాగ్ పోస్టులు ఉన్నాయని రాజ్ కుమార్ నమ్మించాడని రాజ్ కుమార్ అనారోగ్యానికి గురై నగరంలోని ఓ ఆసుపత్రిలో చేరితే అమ్మ శ్రీదేవి సఫర్యలు చేసిందని, రాజ్ కుమార్ చేతి పై “అమ్మ”అని పచ్చ బొట్టు సైతం పొడిపించుకున్నడంటే ఎంతటి దగ్గరో అర్థమవుతుందని అన్నాడు. డబ్బులు తిరిగి చెల్లించమని కోరితే తనకేం సంబంధం లేదని రాజ్ కుమార్, అతను తీసుకున్నారు నాకేంటి అని “అమ్మ” శ్రీదేవి తప్పించుకు తిరుగుతున్నారని మనోజ్ న్యూస్ 10 కు తెలిపారు. డబ్బులు ఇవ్వమంటే గత రెండు సంవత్సరాలుగా వాయిదాలు పెడుతున్నారని అన్నారు.

“అమ్మ” భాగోతం-2