“అమ్మ” భాగోతం-2

“అమ్మ”నిజస్వరూపం…. ఇదిగో సాక్ష్యం పాపాల “శ్రీదేవి”…. మోసాల అడ్డ : సాక్ష్యాలతో సహా నోరువిప్పిన రాజ్ కుమార్

*అమ్మ అనే పదానికే కళంకం తెచ్చి పెట్టింది
*తాను చేసిన తప్పులన్నిటిని ఒప్పుకొని రాజ్ కుమార్ కు ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చింది
*నిరుద్యోగ బాధితులతో ఆశ్రమంలోనే మాట్లాడి తానే డబ్బులు ఇస్తానని ఒప్పుకొని ప్రామిసరి నోట్లు రాసి ఇచ్చింది
*ఈ వ్యవహారం నుండి బయట పడడానికి రాజ్ కుమార్ పై దాడి చేయించి, తీవ్రంగా గాయ పరిచింది
*రాజ్ కుమార్ శ్రీదేవి ది దగ్గరి”సంబంధం”ఆరేళ్లుగా తనను అన్ని రకాలుగా వాడుకుందన్న రాజ్ కుమార్

‘అమ్మ’ రాజ కుమారా…!

శ్రీదేవి అలియాస్ “అమ్మ శ్రీదేవి” అనాథ వృద్ధాశ్రమం పేరుతో సాగిస్తున్న ఆకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నిరుద్యోగులను నిలువునా ముంచి, మాజీ ఆర్మీ కమాండో రాజ్ కుమార్ ను ఈ ఆకృత్యాల్లో పావుగా వాడుకొని 2 కోట్లకు పైగా దండుకుని గొప్ప సేవా పరురాలిగా ఫోజులు కొడుతున్న శ్రీదేవి గతమంతా పాపలమయం అని తెలిసింది. కట్టుకున్న భర్తను సైతం వివిధ కేసుల్లో అకారణంగా ఇరికించి అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నిచిందట. తనకు తాను పెద్ద సెలబ్రిటీ గా జనాలకు పరిచయం చేసుకునే శ్రీదేవి డబ్బున్న వాళ్లు కనపడితే చాలు ఎలాగోలా ఎంతోకొంత వసూలు చేయనిదే ఆమెకు నిద్రపట్టదట. ఇలా ప్రజాప్రతినిధులు మొదలుకుంటే డబ్బున్న వాళ్ళందరూ… తనకు టార్గెట్ గా మారారు.. ఎంతోకొంత వదిలించుకున్నారు."అమ్మ" భాగోతం-2- news10.appఉద్యోగాల పేర “కోట్లు”

తనకు అనేక పరిచయాలు ఉన్నాయని”ఐఏఎస్, IPS అధికారులు మొదలుకొని మంత్రులు, MLA లు “తాను ఏది చెపితే అది వింటారని గొప్పలు చెప్పుకునే శ్రీదేవి ఈ పరిచయాలనే చూపించి నిరుద్యోగులను నిలువునా ముంచింది. అది ఏ ఉద్యోగము అయినా సరే చిటికెలో ఇప్పిస్తామని చెప్పి తాను స్వయంగా వసూలు చేస్తే బాగుండదని మొత్తంగా ఒక్కో నిరుద్యోగి నుంచి ఆరు లక్షలు వసూలు చేయాలని నిర్ణయించి అందులో 2 లక్షలు రాజ్ కుమార్ కు ఇస్తానని, జాబ్ గ్యారంటీ కనుక ముందుగా 4 లక్షలు ఇచ్చి ఉద్యోగం వచ్చాక 2 లక్షలు ఇవ్వాలని నిరుద్యోగుల తో ఒప్పందం చేసుకుంది. ఎలాగూ నిరుద్యోగులకు ఉద్యోగం రాలేదు కనుక వసూలు చేసిన మొత్తాన్ని అంతా నొక్కేసి రాజ్ కుమార్ కు మొండి చేయి చుపించిందట. అసలు కథ ఇక్కడే మొదలయ్యింది. అమ్మ శ్రీదేవి సీన్ లోకి ఎంటర్ కాకుండా వసూళ్ల బాగోతం అంతా రాజ్ కుమార్ నడిపించాడు.. కనుక నిరుద్యోగులు అతన్ని నిలదీయడం మొదలెట్టారు. దీంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక తప్పించుకు తిరగడం మొదలు పెట్టాడు. ఈ తతంగం అంతా అమ్మ అనాధ వృద్ధాశ్రమం నుంచి నడిచింది. కనుక బాధితులంతా ఆశ్రమం వెళ్లి నిలదీయాలని అనుకున్నారు.

నీతి ప్రవచనాలు వల్లించి… కన్నీరు కార్చి

నిరుద్యోగ భాదితులంతా ఆశ్రమం చేరుకొని డబ్బుల విషయంలో నిలదీయడంతో అమ్మ శ్రీదేవి ఆస్కార్ అవార్డ్ స్థాయిలో నటించింది. అసలు ఈ దేశంలో తనకంటే సేవాపరురాలు లేదంటూ తనకు తాను సెల్ఫ్ డబ్బా కొట్టుకుంది. ఆశ్రమంలో మదర్ థెరిస్సా సాక్షిగా అబద్దాలన్నింటినిటిని వండి వార్చింది. అసలు డబ్బుతో సంబంధం లేదని రాజ్ కుమార్ ఓ దొంగ అంటూ నోటికొచ్చిన అబద్ధాలు ఆడింది. భాదితులు అంతా నిలదీయడంతో తనకేం సంబంధం లేదంటూనే డబ్బులు తిరిగి ఇస్తానని తనకు సమయం కావాలని భాదితులను కోరింది. అందుకు వారు ససేమిరా…. అనడంతో తనపై నమ్మకం కలగడానికి అందరికీ ప్రామిసరీ నోట్ రాసిచ్చింది. ఇదంతా బాగానే ఉన్నా డబ్బులు ఇవ్వకుండా తప్పించుకోడానికి తనకున్న పరిచయాలతో కొనసాగిస్తూనే ఉందట. శ్రీదేవి మాట మార్చుతుందనే అనుమానంతో భాదితులు తాను మాట్లాడేది అంతా వీడియో చిత్రీకరించారు. ఆ వీడియో న్యూస్_10 కు చిక్కింది.

భాదితుల్లో ఓ రిటైర్డ్ ఎస్ఐ

తన అల్లుడు, తనయుడికి ఉద్యోగం ఇప్పించడానికి ఓ రిటైర్డ్ ఎస్ఐ అమ్మ శ్రీదేవికి అక్షరాల 8 లక్షల రూపాయలు సమర్పించుకున్నడు. ఉద్యోగాలు రాక… చెల్లించిన డబ్బులు రాక ఆశ్రమం చుట్టూ ఆ రిటైర్డ్ ఎస్ఐ తిరుగుతూనే ఉన్నాడు. అమ్మ శ్రీదేవి ని ఆశ్రమంలో నిలదీసే క్రమంలో రిటైర్డ్ ఎస్ఐ ప్రధాన పాత్ర పోషించాడు. ఓ పోలీస్ అధికారిగా పని చేసి ఉద్యోగం కోసం 8 లక్షలు సమర్పించుకుని మోసపోయానoటే పరువు పోతుందని బయటకు చెప్పకోలేక ఇచ్చిన డబ్బులు తిరిగి రాక మానసిక వేదనకు గురి అవుతున్నాడట.

ఈ బంధాన్ని ఏమనాలి….?

అమ్మ శ్రీదేవి రాజ్ కుమార్ లది విడదీయరాని భందమని స్వయంగా రాజ్ కుమార్ న్యూస్ 10 కు చెప్పారు. ఆరు సంవత్సరాలుగా తనను అన్ని రకాలుగా వాడుకుందని ఆమె మాయలో పడి తన భార్య, పిల్లలను సైతం వదులు కున్నానని అన్నాడు. కొన్ని చోట్ల తనను భర్తగా పరిచయం చేసేదని అనాధ వృద్ధాశ్రమం పెట్టడం తన అసలు భర్తకు ఇష్టం లేకపోతే తనను అడ్డు తొలగించాలని ప్రయత్నం చేసిందని ఈ విషయంలో హన్మకొండ పోలీస్ స్టేషన్ లో కేసు సైతం నమోదు అయ్యిందని రాజ్ కుమార్ ఆరోపించారు. రెండు కోట్లు తన అకౌంట్ లో పడేవరకు తనతో అత్యంత దగ్గరగా ఉన్న శ్రీదేవి డబ్బు రాగానే తన స్వభావం మారిందని అన్నాడు. డబ్బు తీసుకున్నట్లు సాక్ష్యాలు లేకుండా ఉండేందుకు తన మనుషులతో తన పై దాడి చేయించింది అని అన్నారు. కాళ్ళు చేతులు విరిగిపోయి తాను మూడు నెలలకు పైగా ఇంటికే పరిమితం అయ్యానని రాజ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఎలాగైనా చేసి నిరుద్యోగుల డబ్బులు వారికి అందేలా చేస్తానని అన్నాడు.

అన్ని ఒప్పుకుంది….!

రాజ్ కుమార్ పై దాడి చేయించింది తానేనని, 2 కోట్లు తీసుకుంది నిజమేనని త్వరలో చెల్లిస్తనని అమ్మ శ్రీదేవి తానే స్వయంగా ఒప్పుకుంది. ఇవన్నీ నిజాలే అని రాజ్ కుమార్ కు బాండ్ పేపర్ పై పెద్ద మనుషుల సమక్షంలో రాసి ఇచ్చింది. తన అవసరాల నిమిత్తం రాజ్ కుమార్ నుంచి అప్పుగా తీసుకున్నానని ఆ నోట్ లో పేర్కొంది. ఈ వ్యవహారం అంతా వీడియో చిత్రీకరించి రాజ్ కుమార్ అమ్మ శ్రీదేవి దగ్గర నోట్ రాయించుకున్నారు. అక్టోబర్ నెలలో చెల్లిస్తానని సమయం కోరిందని ఆయన వెల్లడించారు.

ఎన్నిసార్లు కాల్ చేసినా….

నిరుద్యోగులను నిండా ముంచిన వ్యవహారం రాజ్ కుమార్ ఆరోపణల నేపథ్యంలో వివరణ కోరడానికి అమ్మ శ్రీదేవి కి న్యూస్_10 నిఘా బృందం ఎన్ని సార్లు ఫోన్ చేసిన లాభం లేకుండా పోయింది. పదుల సార్లు ఫోన్ చేసిన ఫోన్ మాత్రం ఎత్తలేదు… సరికదా తిరిగి కాల్ కూడా చేయలేదు. దీంతో అమ్మ శ్రీదేవి సేవా ముసుగులో కొనసాగిస్తున్న అక్రమ సంపాదన దందా అక్షరాల నిజమేనని భావించాం. రాజ్ కుమార్ భాదితులు అందించిన సాక్ష్యాలు, వీడియో లతో సహా న్యూస్ 10 సేకరించింది.

‘అమ్మ’ రాజ కుమారా…!

(నర్సు నుండి అమ్మ దాకా…. రేపటి సంచికలో)