మట్టిని ఇసుకగా మార్చుతున్నారు..

వర్ధన్నపేట,ఐనవోలు మండలాల్లో నయాదందా
మట్టిని తవ్వి నీటితోకడిగి ఇసుకగా మార్చుతున్న అక్రమార్కులు
ట్రాక్టర్ లోడ్ 5వేల నుంచి 7 వేల వరకు విక్రయం
నాసిరకం ఇసుకతో నిర్మాణాలకు పొంచి ఉన్న ప్రమాదం
పొలీస్ స్టేషన్ లకు సమీపంలోనే కొనసాగుతున్న అక్రమాదందా …చర్యలు మాత్రం శూన్యం
అంతా బహిరంగమే…రెవెన్యూ,మైనింగ్ అధికారులకు మాత్రం అసలు విషయమే తెలియదు…

అసైన్డ్ భూమి,పట్టా భూమి, ప్రభుత్వ భూమి, వాగు, చెరువు, కుంట ఇలా ఏదయినా కావచ్చు అక్రమార్కులు తలుచుకున్నారా….ఇక అంతే సంగతులు. వాటి నుంచి ఎలా కాసులు రాబట్టాలో ఆలోచిస్తారు… ఎవరిని ప్రసన్నం చేసుకుంటే తమ అక్రమ దందాకు ఆటంకం కలుగదో వారిని ఎదో రకంగా మచ్చిక చేసుకుంటారు. ఇంకేముంది అక్రమదందాకు తెరతీస్తారు. సరిగ్గా ఇదే జరుగు తుంది వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట, ఐనవోలు మండలాల్లో. అక్రమాలకు బరితెగించిన కొంతమంది ఏకంగా మట్టినుంచి ఇసుకనే తయారుచేసి నాసిరకం సరుకును జనానికి కట్టబెట్టి నిర్మాణాల భవిష్యత్ ను ప్రశ్నార్థకంగా మార్చుతున్నారు.

మట్టిని ఇసుకగా మార్చుతున్నారు..- news10.app ఇదీ అక్రమ దందా…

వరంగల్ రురల్ జిల్లా వర్ధన్నపేట మండలం కొత్తపల్లి, ల్యాబర్తి గ్రామాలలో మట్టిని ఇసుకగా మార్చే దందా జోరుగా సాగుతోంది. కొత్తపల్లి లో అయితే వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ కు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆకేరు వాగులో దాదాపు 50 నుంచి 60 పీట్ల లోతు తవ్వి మట్టిని తీసి ఇసుకగా మార్చి దందాను నడిపిస్తున్నారు. ట్రాక్టర్లలో మట్టిని నింపి మోటార్లు బిగించి పైపు ద్వారా నీటిని మట్టిపై పోసి బురద, చెత్త చెదారం పోయేలా చేసి మట్టి సన్నగా ఇసుకలా మారేలాచేసి తిరిగి ట్రాక్టర్లల్లో నింపి నాసిరకం ఇసుకను నగరంలో విక్రయిస్తున్నారు. ట్రాక్టర్ లోడ్ ఇసుక 5వేల నుంచి 7 వేల వరకు విక్రహిస్తూ అక్రమ సంపాదనకు తెగపడ్డారు అక్రమార్కులు. ఇంత లోతుగా మట్టి కోసం ఏకంగా వాగులోనే గుంతలు తవ్వడం వల్ల అనేక సందర్భాల్లో మట్టి దిబ్బలు కూలి కూలీలు మృత్యువాత పడ్డారు. అంతేకాదు ట్రాక్టర్లు తిరగబడి మృతిచెందిన సంఘటనలు ఉన్నాయి. పలు మార్లు పోలీసు అధికారులు క్రిమినల్ కేసులు పెడతాం, పీడీ యాక్ట్ కేసులు పెడతాం అన్న మట్టిని ఇసుకగా మార్చుతున్న అక్రమార్కులు ఎంతమాత్రం బయపడడం లేదు. ఇంతలోతు వాగులో తవ్వడం మూలంగా భూగర్భజలాలు అడుగంటిన,వాల్ట చట్టానికి తూట్లు పడిన ఆధికారులు మాత్రం కిమ్మనడం లేదు.

ఇంటికి రెండు ట్రాక్టర్లు..?

కొత్తపల్లి గ్రామంలో కొంతమంది మట్టిని ఇసుకగా మార్చే దందాను కుటీర పరిశ్రమ లాగా భావిస్తూ పనిచేసుకుపోతున్నారు. ప్రస్తుతం ఈ దందాను కొనసాగిస్తూ మట్టిని ఇసుకగా మారుస్తూ సరఫరా చేయడం కోసం ఇంటికో రెండు ట్రాక్టర్లను కొనుగోలు చేసినట్లు న్యూస్10 నిఘా టీం పరిశీలనలో వెల్లడైయింది. ఇదే దందాను మిగతా గ్రామాల్లోని కొంతమంది కొనసాగిస్తున్నారు.ఇక్కడ ట్రాక్టర్ల సంఖ్యను పరిశీలిస్తే కట్రీయల 100,వర్ధన్నపేట 80,ఇల్లంద 100,కొత్తపెళ్లి 150,పంతిని 20,ల్యాబర్తి 15 ట్రాక్టర్లు ఉన్నాయి .ఇవన్నీ మట్టిని ఇసుకగా మార్చే దందాలోనే తిరుగుతున్నాయి. మరోవైపు ఎండాకాలంలో ఇష్టారీతిన మట్టిని తవ్వి వేరేప్రాంతాల్లో మట్టిని డంప్ చేసి వాన కాలంలో ఇసుకగా మార్చి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు.మట్టిని ఇసుకగా మార్చుతున్నారు..- news10.app

ఐనవోలు మండలంలో ఇదే దందా…

ఐనవోలు మండలంలో మట్టిని ఇసుకగా మార్చే దందా నిరాటంకంగా కొనసాగుతుంది.మండలంలోని నందనం గామం రాంనగర్ లో రాత్రి పగలు తేడా లేకుండా యథేచ్ఛగా దందా నడిపిస్తున్నారు. పోలీస్ రేవెన్యూ కార్యాలయాలకు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఈ అక్రమాదందా ఎలాంటి భయం లేకుండా నడుస్తోంది. నందనం వాగులో కొనసాగుతున్న ఈ దందాను పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో మట్టిని నింపి స్పెషల్ జెట్ మోటార్లతో మట్టిని నీటితో కడిగి చిన్న చిన్న రేణువులుగా విడగొట్టి రీసైక్లింగ్ చేసి ఇసుకలా మార్చి విక్రయిస్తున్నారు. ఇక్కడ సైతం వాగులో వీరు తీసిన పెద్ద పెద్ద గోతుల వల్ల అందులో పడి గ్రామస్తులు మృత్యు వాత పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఈ అక్రమ దందాలోనే మండలంలోని నందనం 200, కక్కిరాలపల్లి 80, రాంనగర్100, కొండపర్తి10, సింగారం10 ట్రాక్టర్లు ఉన్నాయి.మట్టిని ఇసుకగా మార్చుతున్నారు..- news10.app

నాసిరకం ఇసుకతో తంటాలు

మట్టిని ఇసుకగా మార్చి నగరంలో విక్రహిస్తున్న ఈ నాసిరకం ఇసుక మూలంగా నిర్మాణాల నాణ్యత ప్రశ్నాఅర్ధకంగా మారింది.ఈ ఇసుకను కొనుగోలు చేసి నిర్మాణాలు చేపట్టినవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కొందరు ఇది నాసిరకం అని తెలియక కొనుగోలు చేసి నిర్మాణాలు చేసి తల పట్టుకున్నారు. ఇంతటి నాదిరకం ఇసుకను పెద్ద పెద్ద భావన నిర్మాణాలలో వాడితే భారీ ప్రమాదం వాటిల్లక తప్పదు.

(అక్రమ దందాపై అధికారులు కిమ్మనరు…ఎందుకో రేపటి సంచికలో)