పోలీసుస్టేషన్ కు లెగ్ ప్రెస్ సానిటైజర్ అందజేత

ఇప్లాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గీసుగొండ పోలీస్ స్టేషన్ కు అడిషనల్ డిసిపి వెంకటలక్ష్మి చేతుల మీదుగా లెగ్ ప్రెస్ శానిటైజర్ ను బుధవారం ఇప్లాస్ ఫౌండేషన్ వ్వస్థాపకులు ఎలగొండ ప్రవీణ్ అందజేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ కరోనా కట్టడిలో పోలీసుల సేవలు మరువలేనివి అని, ప్రాణాలకు సైతం తెగించి కుటుంబాలను వదిలి డ్యూటీ చేయడం పోలీసులకు మాత్రమే చెల్లుతుందన్నారు.పోలీసుస్టేషన్ కు లెగ్ ప్రెస్ సానిటైజర్ అందజేత- news10.app

పోలీసులు విధినిర్వహణలో అన్ని చోట్లకు వెళ్లాల్సి వస్తుందని ఇది గమనించిన తాను ఫౌండేషన్ నుండి గీసుగొండ పోలీస్ స్టేషన్ కు శానిటైజర్ అందచేయాలని అనుకున్నానన్నారు. తానులాక్ డౌన్ వల్ల హైదరాబాద్ లో ఉండడంతో, సాధ్యపడలేదని ప్రస్తుతం లాక్ డౌన్ సడలించారు కనుక ఈ రోజు డిసిపి చేతుల మీదుగా సీఐ శివరామయ్య కు అందచేయటo జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏసిపి శ్యామ్ సుందర్, సీఐ శివరామయ్య, ఎస్ ఐ నాగరాజు, పోలీస్ సిబ్బంది తో పాటు ప్రవీణ్, సంపత్, గణేష్, నెల్సన్ తదితరులు పాల్గొన్నారు.