పోలీస్ పాసులకు దరఖాస్తు చేసుకోండి

కరోనా వ్యాధి నియంత్రణలో భాగం రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. ఈ లాక్ డౌన్ సమయంలో అత్యవసర సేవలతో పాటు నిత్యవసర వస్తువుల రవాణా చేసే విభాగాలకు రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపును ఇవ్వడం జరిగింది .కావున వరంగల్ పోలీస్ కమిషనరేట్ అత్యవసర సేవలతో పాటు నిత్యవసర వస్తువుల రవాణా చేసే వాహనలతో కోసం సంబంధిత విభాగాల వారు పోలీసుల పాస్ ల గురించి ధరఖాస్తు చేసుకోగలరు. పాసుల కోసం పోలీస్ పరేడ్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్‌లో సంప్రదించగలరు. మరిన్ని వివరాల కోసం ఎసిపి శివరామయ్య ను(9000466488)సంప్రదించగలరు.