జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

కరోనాపై పోరులో జర్నలిస్టుల పాత్ర అమోఘం
ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

కాజిపేట: తెలంగాణ ఉద్యమం తరహాలోనే కరోనాపై పోరులో జర్నలిస్టుల పాత్ర అద్వితీయమని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఆదివారం ఫాతిమా నగర్ లో కౌండిన్య పరపతి సంఘం ఆధ్వర్యంలో జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ… రాజకీయంగా తన ఎదుగుదలలో జర్నలిస్టుల సహకారం మరిచి పోలేనని, ఇలాంటి అపత్కాలంలో జర్నలిస్టుల అండగా ఉంటూ.. వారి సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి- news10.app

గౌడ కులస్తులకు తన సహకారం ఉంటుందని వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరి కృష్ణ గౌడ్ వంద మంది జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా నాయకులు బుర విద్యా సాగర్, తాళ్లపల్లి జనార్ధన్, వడ్లకొండ వేణుగోపాల్, తీగల జీవన్, పులి సంపత్, బత్తిని రమేష్, డాక్టర్ చిర్ర రాజు, అంబాల సూర్య నారాయణ, బొమ్మగాని వినోద్, కాసాగాని అశోక్, ఏరుకొండ పవన్ కుమార్, కౌండిన్య పరపతి సంఘం అధ్యక్ష, కార్యదర్శులు తడక రాజనారాయ, నాయకపు సుభాష్, కోశాధికారి పొగకుల అశోక్, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, సీనియర్ జర్నలిస్టులు గౌడ జర్నలిస్టులు లక్ష్మి నారాయణ, తిరుపతి, పి.సుభాష్, ఎం. అరుణ్, కె. నరేందర్, మధు తదితరులు పాల్గొన్నారు.