బ్యాంకును తరలించొద్దు

గొర్రెకుంట ఎస్ బి ఐ బ్యాంక్ తరలింపు సరి కాదంటున్న గ్రామస్తులు
ఎందుకు తరలిస్తున్నారని బ్యాంక్ అధికారులపై ఆగ్రహం
తరలిస్తే ఊరుకునేది లేదని స్పష్టీకరణ

బ్యాంకును తరలించొద్దు- news10.app

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గొర్రెకుంట బ్రాంచ్ ను లేబర్ కాలనీ కి తరలిం చేందుకు బ్యాంక్ అధికారులు ప్రయత్నాలు చేయడాన్ని గ్రామస్తులు తప్పుబడుతున్నారు. బ్యాంకు ను తరలిస్తున్నట్లు అధికారులు ఇటీవల బోర్డ్ పెట్టడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంక్ ను తరలించడం వల్ల ఖాతాదారులకు ఇబ్బంది గా మారే అవకాశం ఉందని గొర్రెకుంట, కీర్తినగర్ వాసులు అంటున్నారు. బ్యాంక్ తరలింపుపై గొర్రెకుంట మాజీ ఎంపీటీసీ పోలేపాక సుమన్ మాట్లాడుతూ గొర్రెకుంట క్రాస్ రోడ్ లో ఉన్న బ్యాంక్ ను క్రిస్టియన్ కాలనికి మార్చడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. గొర్రెకుంట ప్రాంతంలో నే బ్యాంక్ ను కొనసాగించాలని అధికారులను కోరారు. గొర్రెకుంట ఎస్ బి ఐ బ్యాంక్ లో ఇరవై వేలమంది ఖాతాదారులు ఉన్నారని, అందులో వృద్ధులు, పెన్స్షన్ దారులు ఉండటం మూలంగా బ్యాంక్ ని వేరే ప్రాంతానికి తరలిస్తే చాలా మంది ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. బ్యాంక్ గొర్రెకుంటలో ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవని .అలాంటప్పుడు బ్యాంక్ అధికారులకు వచ్చే నష్టం ఎంటన్నారు. వేరే ప్రాంతానికి తరలిస్తే బ్యాంక్ కు వచ్చే సమయంలో లేదా రోడ్డు దాటే క్రమంలో వృద్దులకు ఏదైనా జరగరానిది జరిగితే బ్యాంక్ అధికారులు బాధ్యత వహించాలని ఆయన హెచ్చరించారు. బ్యాంక్ తరలింపు ప్రక్రియను ఆపివేయకుంటే ఆందోళన నిర్వహిస్తామన్నారు.