ఎన్నికలు సరే….కరోనా సంగతేంది…?

కరోనా సెకండ్ వేవ్ అతి వేగంగా విస్తరిస్తుందని… ఈ వైరస్ ఇప్పుడు గాలి ద్వారా కూడా వ్యాపించవచ్చని… రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. ఓ వైపు సర్కార్ చెపుతూనే ఉంది… మాస్క్ తప్పనిసరి చేసి ఉల్లంఘించిన వారి ముక్కుపిండి మరీ వెయ్యి రూపాయల పైన్ వేస్తున్నారు… కరోనా ను అరికట్టేందుకు వ్యాక్సిన్ వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు… మరో వైపు ప్రయివేటు ఆస్పత్రిలో బెడ్ దొరకాలంటే మూడు రోజులు వేచివుండాల్సిన దుస్థితి…పెరుగుతున్న కేసుల దృష్ట్యా గాంధీ ఆస్పత్రిని సర్కార్ పూర్తి స్థాయి కోవిడ్ ఆస్పత్రిగా మార్చింది… ఇంతటి భయానక స్థితిలో రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికల కమిషన్ గురువారం నోటిఫికేషన్ జారిసీజేసింది.

ఎన్నికలు సరే....కరోనా సంగతేంది...?- news10.app

ఓ వైపు కరోన జాగ్రత్త అంటూనే స్థానిక సమరానికి నగారా మోగించింది… కరోనా సెకండ్ వేవ్ ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ఈ సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంపై ఓటర్లు పెదవి విరుస్తున్నారు… పార్టీల నేతలు సైతం కరోనా వేగంగా విస్తరిస్తుంటే.. తాము ఎలా ప్రజల మధ్య తిరగాలనే సందేహంలో పడ్డారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రాష్ట్ర ల సీఎం లు, ముఖ్య నాయకులు, అనేక మంది క్రియాశీల కార్యకర్తలు ప్రచారం లో తిరిగి కరోనా బారిన పడ్డారు… దింతో ఇక్కడి నాయకుల్లో సైతం ఎన్నికల ప్రచారం పట్ల భయం పట్టుకుంది… ఎన్నికల్లో ప్రచారం చేయకుండా, రోడ్ షో నిర్వహించకుండా, జనాలు గుమిగూడకుండా, ఇంటింటి ప్రచారం చేయకుండా నాయకులు ఉండరు గెలుపు బాట పట్టాలంటే ప్రచారమే కీలక పాత్ర పోషిస్తుంది… కానీ ఇలాంటి సమయంలో ఓటర్ల మధ్య తిరగడం ఎలా సాధ్యమనేదే నాయకుల ప్రశ్న.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న జన సమూహంలో తిరిగితే కరోనా రాకుండా ఎలా ఆపగలుగుతాం అనేది సందేహం ప్రస్తుతం నాయకుల్లో కలుగుతుంది.

ప్రచార సమయంలో కరోనా భయంతో ఓటర్లు ఇంటి గుమ్మం కూడా దాటనియకపోతే తమ పరిస్థితి ఏంటని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు.. ఇక కొందరైతే కరోన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఎన్నికలను వాయిదా వేస్తుందని సామాజక మాధ్యమాలల్లో ప్రచారం చేస్తున్నారు… పదవతరగతి పరీక్షలు రద్దు చేసిన ప్రభుత్వం… అలాగే ఎన్నికల కమిషన్ కు సూచించి స్థానిక ఎన్నికలు కూడా రద్దు చేస్తుందని సోషల్ మీడియాలో మెసేజ్ చక్కర్లు కొడుతోంది… ఇది ఇలా ఉంటే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులుపుకున్న ఎన్నికల కమిషన్ కరోన విషయంలో ఎలాంటి జాగ్రత్తలు చెపుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు… ఎన్నికలు సరే కరోనా సంగతేందని అడుగుతున్నారు… బహిరంగ సభలు, రోడ్ షో లకు అనుమతి ఇవ్వకుండా ఉంటారా అని అంటున్నారు… ఇంటింటి ప్రచారాన్ని నిషేదిస్తార… ప్రచారంలో ఇద్దరికి మించి ఉండవద్దని సూచిస్తార అంటున్నారు… ఈ ప్రశ్నలకు ఎన్నికల కమిషన్, సర్కార్ ఎం సమాధానం చెపుతుందో చూడాలి.