రాజకీయ ఎదుగుదలకు… అనైక్యతే అవరోధం….!

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో.. గౌడ కులస్తులు చురుకైన పాత్ర పోషించారు.. అలాంటి గౌడ కులస్తులను అన్ని రాజకీయ పార్టీలు విస్మరిస్తున్నాయి.. తమను కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకునే తప్ప రాజకీయ అవకాశాలు ఎంత మాత్రం కల్పించడం లేదు.. ఈసారి జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో, గౌడ కులస్తులకు 10 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం.. మాకు అవకాశాలు కల్పించే పార్టీకి అండగా ఉంటాం..

రాజకీయ ఎదుగుదలకు... అనైక్యతే అవరోధం....!- news10.app

ఎన్ని ప్రభుత్వాలు మారినా… గీత అన్నల తలరాతలు మారడం లేదు.. గీత వృత్తి చేస్తూ ప్రమాదవశాత్తు అంగవైకల్యం చెందిన వారికి, మరణించిన వారికి పది లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం… ముందుగా మెడికల్ బోర్డు ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తొలగించాలి. మెడికల్ బోర్డు పని తీరు కారణంగా గీత కార్మికులకు తీరని అన్యాయం జరుగుతుంది. కేసీఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం గౌడ కులస్తుల సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించి వాటి అమలుకు కృషి చేస్తుంది.. కానీ రాజకీయ అవకాశాలు కల్పించడంలో మాత్రం నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తోంది., అందుకే కెసిఆర్ కు మంత్రి కేటీఆర్ కు విజ్ఞప్తి చేస్తున్నాం.. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మా జనాభా దామాషా ప్రకారం కార్పొరేషన్ ఎన్నికల్లో 10 స్థానాలు కేటాయించాలని, కోరుతున్నాం.. గౌడ కులస్తులలో నెలకొన్న అనైక్యతే , మా రాజకీయ ఎదుగుదలకు అవరోధంగా మారుతుంది.. ప్రతిసారి కార్పొరేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనను, పార్టీ అధిష్టానం, నివారించింది.. సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ల పైన ఉన్న నమ్మకంతో, పార్టీ పరంగా నిలబెట్టిన అభ్యర్థుల గెలుపు కోసం పని చేశా.. ప్రచారం చేశాం.. అభ్యర్థుల గెలుపుకు బాటలు వేశా.. ఈ దఫా తప్పక తనకి 54 వ డివిజన్ టికెట్ పార్టీ కేటాయిస్తుందని విశ్వసిస్తున్నాను, అనేక పార్టీలో ఉన్న మా సామాజిక వర్గం, కుల పటిష్టత కోసం, అభివృద్ధి కోసం, పని చేస్తాం.. రాష్ట్రంలో 9 శాతం ఉండి, 40 లక్షల జనాభా కలిగి ఉన్న మా సామాజిక వర్గానికి టిఆర్ఎస్ పార్టీ తప్పక న్యాయం చేస్తుందని నమ్ముతున్నాం అంటున్నా.. టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోనగాని యాదగిరి గౌడ్ తో, మా న్యూస్10 వర్ధన్నపేట నియోజకవర్గం ప్రతినిధి గడ్డం రాజేందర్ అందిస్తున్న ప్రత్యేక ఇంటర్వ్యూ.

న్యూస్ 10 : తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన గౌడ కులస్తులకు అధికార టీఆర్ఎస్ పార్టీ రాజకీయ అవకాశాలు కల్పించడం లేదు, ప్రతి నియోజకవర్గంలో 25 వేల మంది మీ సామాజికవర్గ జనాభా ఉన్నప్పటికీ, మీకు అధికార పార్టీ అన్యాయం చేస్తుందా…?

బోన గాని యాదగిరి గౌడ్ :

ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీకి తాము అండగా నిలిచాం.. పార్టీ మా పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్న విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకు పోవడం జరిగింది. ఇకపై గౌడ కులస్తులకు న్యాయం చేస్తాం రాజకీయ అవకాశాలు, కల్పిస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చింది. మా సామాజిక వర్గానికి ప్రభుత్వం రాజకీయ అవకాశాలు కల్పిస్తుందని విశ్వసిస్తున్నాం.

న్యూస్ 10: త్వరలో రాబోతున్న కార్పొరేషన్ ఎన్నికల్లో గౌడ కులస్తులకు ఎన్ని స్థానాలు కావాలని మీరు డిమాండ్ చేస్తున్నారు.. అవి ఎక్కడెక్కడ ?

బోన గాని యాదగిరి గౌడ్ :

నగరంలోని మా జనాభా దామాషా ప్రకారం 66 స్థానాలున్న కార్పోరేషన్ లో కచ్చితంగా 10 స్థానాలు కోరుకుంటున్నాం.. మడికొండ, వడ్డేపల్లి, చింతగట్టు, రామన్నపేట, ఉర్సు కరీమాబాద్ దేశాయిపేట, తదితర స్థానాల్లో అభ్యర్థులు ఇప్పటి నుండే ప్రచారం కొనసాగించు కుంటున్నారు.. ఆ స్థానాల్లో తప్పక గెలుస్తాం..

న్యూస్ 10: మీ విషయంలో కూడా టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేసింది. ఇండిపెండెంట్ గా నిలబడ్డ మిమ్మల్ని విత్ డ్రా చేయించింది. ఇప్పుడు కూడా మీకు టికెట్ ఇవ్వకుండా నిరాశ ఎదురైతే పార్టీ మారుతారా…?

బోన గాని యాదగిరి గౌడ్ :

టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా పార్టీ మారను. 2014 లో టిఆర్ఎస్ పార్టీలో చేరా.. పదవులులేమి ఆశించకుండానే పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేశా… సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ మా నేత శ్రీనివాస్ గౌడ్ ఆదేశాలే శిరోధార్యంగా పని చేశా.. సీఎం కేసీఆర్ కేటీఆర్ ల పై పూర్తి నమ్మకం ఉంది. పార్టీ కోసం పనిచేసే నాలాంటి సీనియర్ లకు అన్యాయం చెయ్యరనే అపార నమ్మకం నాకుంది.

న్యూస్ 10: రానురాను టిఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో నమ్మకం పోతుంది. ఇచ్చిన హామీలను అమలు పరచక పోగా కుల సంఘాలను, నమ్ముకున్న ఉద్యమకారులను మోసం చేస్తూ, కుటుంబ పాలన చేస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటున్న టిఆర్ఎస్ పార్టీపై ఎందుకు మీకు ఇంత నమ్మకం….?

బోన గాని యాదగిరి గౌడ్ :

ప్రజలకు, కుల సంఘాలకు, ఉద్యమకారులకు, ప్రభుత్వం అండగా నిలుస్తోంది. కొంత ఆలస్యం అయినప్పటికీ ఈ వర్గంలోని అందరికీ న్యాయం జరుగుతుంది. నా రాజకీయ గురువు నా స్ఫూర్తి ప్రదాత.. మంత్రి కేటీఆర్ అని, ఆయన ఇచ్చిన మాట తప్పక నెరవేరుస్తారని నమ్మకం ఉంది
.
న్యూస్ 10 : మీ గౌడ కులస్తులు నెలకొన్న అనైక్యతే, మీ సంఘాల్లోని ఒకరిపట్ల ఒకరికి ఉన్నా అపనమ్మకమే.. మీ రాజకీయ ఎదుగుదలకు అవరోధమా…?

బోన గాని యాదగిరి గౌడ్ :

నిజమే మా సంఘాల్లో నెలకొన్న అనైక్యత, కొంత మా రాజకీయ ఎదుగుదలకు అవరోధం అయినప్పటికీ, ఇప్పుడు సమిష్టిగా కార్పొరేషన్ ఎన్నికల్లో మా సత్తా చూపిస్తాం.. ఒక ఇంట్లోనే అన్నదమ్ములే నాలుగు పార్టీలో ఉంటున్నా ఈ రోజుల్లో.. పెద్ద సామాజిక వర్గం అయినా గౌడ కులస్తులు, నాలుగు పార్టీలో ఉన్నప్పటికీ, మా లక్ష్యం.. ధ్యేయం.. మా సామాజిక వర్గ అభివృద్ధి.. రాజకీయలబ్ధి..