ఎన్‌కౌంటర్‌లో ఎస్సై, నలుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. మన్పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పర్ధోని గ్రామ సమీపంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో  మదన్‌వాడా  ఎస్సై ఎస్‌.కె.శర్మ, మహిళా మావోయిస్టుతో పాటు నలుగురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. కాల్పుల అనంతరం ఘటనా స్థలం నుంచి ఏకే 47, రెండు 315 బోర్‌ రైఫిళ్లు, ఒక ఎస్‌ఎల్‌ఆర్‌ ఆయుధం స్వాధీనం చేసుకున్నట్టు రాజ్‌నందగాన్‌ ఏఎస్పీ జీఎన్‌ బాఘెల్‌ తెలిపారు. మావోయిస్టుల కోసం కూంబింగ్‌ కొనసాగుతోంది.

ఎన్‌కౌంటర్‌లో ఎస్సై, నలుగురు మావోయిస్టులు మృతి- news10.app