పోలీసులకు కరోన పాజిటివ్

మహారాష్ట్రలో కరోనా కలవరపెడుతోంది.లాక్ డౌన్ తో ఎన్ని జాగ్రత్తలు పాటించిన ఇంకా తగ్గు ముఖం పట్టడం లేదు.దీంతో రాష్ట్ర ప్రజలు ఆందోళన పడుతున్నారు. దేశంలో అత్యధిక కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు మహారాష్ట్రలోనే ఉన్నాయి. కరోనా నిర్ధారణ పరీక్షల్లో మహారాష్ట్ర పోలీసుశాఖకు చెందిన 714 మంది పోలీసులకు పాజిటివ్ వచ్చినట్లు రాష్ట్ర పోలీస్ శాఖ తెలిపింది. ప్రస్తుతం 648 మంది పోలీసులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ 61 మంది కోలుకోగా, కరోనా వల్ల ఐదుగురు పోలీసులు మృతిచెందారు. లాక్‌డౌన్ సమయంలో పోలీసులపై 194 దాడులు జరిగాయని, దీనికి సంబంధించి 689 మంది నిందితులను అరెస్టు చేశామని పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ పేర్కొంది. మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబై మహానగరంలోనే కరోనా తీవ్రత అధికంగా ఉంది.

పోలీసులకు కరోన పాజిటివ్- news10.app