చెక్కు కొట్టు….పక్కన పెట్టు!

అధికార పార్టీలో గ్రేటర్ ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆశావహుల సంఖ్య చాంతాడంత ఉంది… గత కొన్ని సంవత్సరాలుగా వివిధ డివిజన్లలో పనిచేస్తూ… ప్రజల మధ్య తిరిగిన విద్యార్థి సంఘం నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు,పార్టీ సీనియర్లు ఈ గ్రేటర్ ఎన్నికల్లో తమను పార్టీ గుర్తిస్తుందని తెగ ఆశలు పడ్డారు… ఎన్నికలు రాకముందు ఆయా డివిజన్లలో పనిచేస్తున్న వారిని ప్రోత్సహించిన ప్రజాప్రతినిధులు ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఒక్కసారిగా ప్లేట్ పిరాయించి పనిచేస్తున్న తమను కాదని కొత్తవారి పేరు తెరపైకి తెచ్చి తమను పక్కన పెట్టారని అనేకమంది గులాబీ కార్యకర్తలు, నాయకులు తెగ ఆవేదన చెందుతున్నారు… టికెట్ పంపిణీ వ్యవహారం చూస్తున్న ప్రజాప్రతినిధులు ఆయా డివిజన్ లనుంచి మీరు పోటీలో ఉండవద్దని చెప్పడంతో చిన్నబుచ్చుకున్న కొందరు ఎన్నికల కు ప్రచారానికి, అవసరమైతే పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకొని కాంటాక్ట్ లో లేకుండా వారి పనిలో వారు నిమగ్నం ఐయిపోయారట.

చెక్కు కొట్టు....పక్కన పెట్టు!- news10.app

చెక్కు కొట్టు….

గులాబీ పార్టీలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడం, స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టిలో పోటీలో నిలిపెందుకు వేరే వారి పేర్లు ఉండడంతో డివిజన్ లో పోటీచేయాలనుకుంటున్న విద్యార్టీ నాయకులు, ఉద్యమ కారులు, పార్టీ సీనియర్ లను తప్పించేందుకు… పశ్చిమ నియోజకవర్గంలో ఓ సరికొత్త ఆలోచనకు నాయకులు శ్రీకారం చుట్టారు… పోటీలో వారు ఉండకుండా చేసేందుకు అధిష్టానం నుంచి ఓ చిన్న గిఫ్ట్ అంటూ దాదాపు 33 మందికి మూడు లక్షల చొప్పున చెక్కులు అందించి నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయం డివిజన్ లల్లో సైతం జోరుగానే ప్రచారం జరుగుతోంది మొన్నటిదాకా పోటీ అన్నారు ఇప్పుడు ఏమైందని కొన్ని డివిజన్లలో కొందరిని ప్రశ్నిస్తే మావాడికి చెక్కు కొట్టి పక్కన పెట్టారని ఆ నాయకుల అనుచరులు బాహాటంగానే చెపుతున్నారు… ఐయితే ఈ చెక్కులను కొంతమంది వద్దని తిరస్కరించి అలిగి వెళ్లిపోగా… మరికొంతమంది చేసేది ఏమిలేక మహాభాగ్యం అంటూ చెక్కులను స్వీకరించారని తెలిసింది. మరోవైపు కొందరు చెక్కు తీసుకున్న మరికొందరు తీసుకోకున్న పోలింగ్ టైం వరకు వీరు ఏంచేస్తారు… వారు పోటీచేయాలనుకున్న డివిజన్ లో ఎవరికి మద్దతుగా నిలుస్తారు… ఎన్నికల్లో అలిగి తటస్థంగా ఉండి వీరికి చెందిన ఓట్లను ఎటువైపు మల్లిస్తారనేది ప్రస్తుతం చర్చానీయాంశంగా మారింది.