ధనమే కదా…!

పైసలు దండిగుంటే రాజకీయాల్లో పెద్దపీట…!
ఆసక్తి లేకున్నా జరుగుతుంది నీకై వేట…!

నమ్ముకున్న జెండా దారులను నట్టేట ముంచుతారు…!
గంపగుత్తా బేరం పెట్టి టిక్కెట్లు అమ్ముతారు…!

ఎంతకష్ట పడ్డాకాని నీకు దక్కేది శూన్యం…!
రాజకీయ చదరంగం లో డబ్బు లేని వారి పరిస్థితి దైన్యం…!

ఇదేకదా నేడు నడుస్తున్న రాజకీయం…!
ప్రజల మద్దతు ఏమాత్రం లేని ఆరాచకీయం…!