కల్తీ మయం…!

అంతా కల్తీ మయం…!
మాటలు కల్తీ…మనుషులు కల్తీ మనసులు కల్తీ…!
ప్రేమలు కల్తీ…ప్రేమ పేరుతో మోసం చేసే వారే కల్తీ!

అక్రమ సంపాదనకు అర్రులు చాసే వారి బుద్ధి కల్తీ…!
తిండి కల్తీ..తిండి ధాన్యాలు కల్తీ!
పాలను సైతం మలినం చేసి ప్రజారోగ్యం పాలిట రాక్షసులుగా మారిన వారి బతుకే కల్తీ…!

అంతా కల్తీ మయం…! పాలకులు నిద్ర మయం!
అధికారులు మామూళ్ల మయం!
ప్రజల బ్రతుకులు సర్వం గాలిలో దీపం …!!