ఆశ పెట్టారు…వేధిస్తున్నారు…!

వరంగల్ నగరంలో ఓ ఎలక్ట్రానిక్ సంస్థ వేధింపులపై డీలర్ల ఆందోళన
లాభాల ఆశ చూపి డిస్ట్రిబ్యూషన్ ఇచ్చిన యాజమాన్యం
డిపాజిట్ రూపంలో లక్షలు వసూలు చేసిన వైనం
వాయిదా పద్దతిలో ఎలక్ట్రానిక్ పరికరాల అమ్మకాలు…..లక్షల్లో నష్టపోయి ఇబ్బందులు పడుతున్న డీలర్లు
డీలర్ల దుకాణాలకు తాళాలు వేసిన సిబ్బంది…. ఇదేంటని ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్ లో పిర్యాదు
ఆ ఎలక్ట్రానిక్ సంస్థ సిబ్బందితో చేతులు కలిపిన అధికార పార్టీ నాయకులు?

మావద్ద టివిలు తీసుకోండి అమ్మకాలు కొనసాగించండి…సేల్స్ బాగా పెంచి సంస్థకు లాభాలు పెంచండి మీరు లాభం పొందండి అంటూ ఉదర గొట్టిన ఓ ఎలక్ట్రానిక్ పరికరాల సంస్థ ప్రస్తుతం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న డీలర్లను నానా తిప్పలు పెడుతోందట… కంపెనీ నుండి టీవీలు కొనుగోలు చేసిన డీలర్లు దుకణాలు ఏర్పాటు చేసుకొని… సంస్థకు డిపాజిట్ రూపంలో డబ్బులు చెల్లించి ఈఎంఐ ల రూపంలో వస్తువులు విక్రయిస్తుండగా… ముందు ఓ మాట చెప్పిన కంపెనీ వాయిదాలతో తమకు సంబంధం లేదు…ఎ న్ని వస్తువులు విక్రయించారో అన్ని డబ్బులు నెల వారిగా చెల్లించాలని చెప్పడంతో డీలర్లు బిక్కమొహం వేశారు… లక్షల రూపాయలు వినియోగదారులవద్ద ఉండగా… అవి నెల నెలా వాయిదాల రూపంలో వస్తుండగా… ఈ ఎం ఐ లతో తమకు సంబంధం లేదు ఒకేసారి డబ్బులు చెల్లించాలని సంస్థ చెప్పడంతో ప్రస్తుతం డీలర్లు ఆందోళన చెందుతున్నారు. ఒకేసారి అంత మొత్తం డబ్బులు ఎక్కడినుంచి కట్టాలని ఆవేదన చెందుతున్నారు.

ఆశ పెట్టారు...వేధిస్తున్నారు...!- news10.app

ఇది వ్యవహారం….

వరంగల్ నగరంలో వాయిదాల పద్దతిలో ఎలక్ట్రానిక్ పరికరాలు అమ్మకాలు కొనసాగుతున్నాయి. ప్రజలు కూడా ఇందుకు అలవాటు పడి నెలల వారిగా వాయిదా పద్దతిలో కొనుగోలు చేసి సంతృప్తి పడుతున్నారు. ఇక్కడివరకు బాగానే ఉన్నప్పటికీ కొన్ని సంస్థలు కొత్తగా ఏర్పడిన జిల్లాల వారిగా డీలర్లను ఏర్పాటు చేసుకుని వారికి డీలర్ షిప్ ఇవ్వటం జరుగుతుంది…. ఇందులో భాగంగా వరంగల్ లో ఒక సంస్థ ఉర్సు కరీమాబాద్ కి చెందిన ఓ వ్యక్తిని వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరికొంతమందిని డీలర్లుగా తీసుకుని వీరి వద్ద నుంచి ఒక్కొక్కరి దగ్గర నుండి దాదాపు 4 లక్షల రూపాయలు డిపాజిట్ రూపంలో తీసుకున్నారు. లక్ష రూపాయల విలువగల పరికరాలు వారికి అందించారు. సంవత్సరం వరకు సాఫీగా సాగిన వ్యాపారం ఇప్పుడు డీలర్లకు ఇబ్బందిగా మారిందట. ప్రస్తుత పరిస్థితుల్లో డీలర్లు డబ్బులు కట్టినప్పటికి ఎలక్ట్రానిక్ వస్తువులు పంపించకుండా కొన్ని మాత్రమే పంపించి అందుకు మళ్ళీ డబ్బులు వసూలు చేయడం మొదలు పెట్టారట… దింతో విసిగిపోయిన డీలర్లు మేము డిపాజిట్ చేసిన నగదు మీ దగ్గర ఉన్నప్పటికీ మళ్ళీ మమ్ములను డబ్బులు ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నిస్తే డీలర్ల దుకాణాలకు సంస్థ సిబ్బంది తాళాలు వేయటం మొదలెట్టి వ్యాపారం నడవకుండా చేస్తున్నట్లు తెలిసింది ఫలితంగా డీలర్లు భారీగా నష్టపోతున్నారు. సంస్థ వేధింపులతో విసిగి వేసారి ఇదేంటని డీలర్లు ప్రశ్నించిన వారి పై సంబంధిత పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసి స్టేషన్ కి పిలిపించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని సంబంధిత ఎలక్ట్రానిక్ సంస్థ కి సంబందించిన ఓ డీలర్ వాపోయాడు… ఇందుకు కొందరు తాజా మాజీ కార్పొరేటర్లు సంస్థ సిబ్బంది తో చేతులు కలిపి తతంగం అంతా నడుపుతున్నట్టు డీలర్ లబోదిబోమంటున్నాడు.

వరంగల్ ఒక్క జిల్లా లోనే కాకుండా ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర జిల్లాల డీలర్ల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందని ఇలా బయ బ్రాంతులకు గురిచేస్తే డీలర్లు అంతా ఏకమై ఆందోళనకు దిగడానికి కూడా వెనుకాడబోమని సదరు ఎలక్ట్రానిక్ సంస్థ కు బహిరంగ హెచ్చరిక చేస్తున్నారు. అధికారులు విచారణ చేపట్టి నష్టపోయిన డీలర్లకు న్యాయం చేయాలని ఉర్సు కరిమాబాద్ కి సంబందించిన డీలర్ కోరుతున్నాడు.