ఎ ప్టీ ఎల్ భూముల్లో నిర్మాణాల దర్జా…!

చెరువులు, కుంటలు ఎక్కడైనా అనుమతులు
ఏప్టీఎల్ పరిధిలో ఇష్టారాజ్యంగా అనుమతులు ఇస్తున్న రెవెన్యూ అధికారులు
ఉరుగొండ పెద్దచెరువు శిఖం భూమిలో పాఠశాల బిల్డింగ్
ప్రధాన రహదారి పక్కన ఎఫ్టిఎల్ భూమిలో కట్టిన ఆడిగేవారే లేరు
అసలు ఎఫ్టిఎల్ భూమి కన్వర్షన్ ఎలా అవుతుంది…?
అంతా ప్రజాప్రతినిధులు,రెవెన్యూ అధికారుల మాయే అంటున్న ప్రజలుఎ ప్టీ ఎల్ భూముల్లో నిర్మాణాల దర్జా...!- news10.app ప్రజాప్రతినిధులు, అధికారులు అక్రమార్కులతో చేతులుకలిపితే ఏదైనా చేయొచ్చు. కుంటలు,చెరువులు, నదులు ఇలా ఏదయినా తమ అధికార బలం తెలివితేటలను ఉపయోగించి మాయం చేయొచ్చు. మనవాడైతే చాలు ప్రభుత్వ నిబంధనలను సైతం పక్కకు నెట్టి కావాల్సింది చేయవచ్చు. ఎవరైనా ప్రశ్నిస్తే ఏదైనా లొసుగును ఆసరాగా చేసుకుని సమర్దించుకోవచ్చు. వరంగల్ రూరల్ జిల్లా దామెర, ఆత్మకూరు మండలాలలో సరిగ్గా ఇదే జరుగుతుంది. రెవెన్యూ అధికారులు కళ్ళు మూసుకొని తిరుగుతుండడం వల్ల భూ అక్రమార్కులు రెచ్చి పోతున్నారు ఎఫ్టిఎల్ పరిధి భూములను దర్జాగా ఆక్రమించి, అధికారులతో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్టిఎల్ పరిదినుంచి భూములను తప్పించి నడి చెరువు, కుంటల్లో యథేచ్ఛగా నిర్మాణాలు చేస్తున్నారు. ఎఫ్టిఎల్ భూమి రెసిడెన్షియల్ గా కన్వెర్షన్ కావాలంటే రెవెన్యూ అధికారులు ఇందుకు సహకరించాల్సిందే.. నిర్మాణాలు అయిన ఎఫ్టిఎల్ భూములను పరిశీలిస్తే కళ్లు ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది ఇది చెరువు భూములు అని కానీ రికార్డులు అన్ని ఉండి, ఏది చెరువు భూమి, ఏదీ కాదు. అని అన్ని తెలిసిన రెవెన్యూ అధికారులు మాత్రం అనుమతులు ఇస్తూ పెద్ద పెద్ద భవంతులు ఎఫ్టిఎల్ భూముల్లో కడుతుంటే కళ్ళు అప్పగించి చూస్తున్నారు. ఎలాంటి హాక్కు లేకుండా ఎఫ్టిఎల్ భూమికి మేము యజమానులం. అనిచెపుతుంటే దానికి రెవెన్యూ అధికారులు తానా అంటే తందాన అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దింతో ఈ మండలాలలోని చెరువులు, కుంటల ఎఫ్టిఎల్ భూములన్నీ పరుల సొంతం అవుతున్నాయి.

ఎఫ్టిఎల్ భూమిలో పాఠశాల దర్జా…!

వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం ఉరుగొండ పెద్దచెరువు ఎఫ్టిఎల్ భూమిలో కె ఎస్ ఆర్ పేరుతో ఓ పాఠశాల భవనం దర్జా వేలగబెడుతోంది. చెరువు శిఖం భూమిలో రెండంతస్తుల భవనాన్ని బేఫికర్ గా నిర్మించేశారు. హన్మకొండ ములుగు ప్రధాన రహదారిపై ఉన్న ఈ పాఠశాల భవనం పూర్తిగా ఎఫ్టిఎల్ పరిధిలోనే ఉంది. చెరువును చుట్టూ శిఖం భూమిలో ఉన్న పొలాలను ఆనుకొని మధ్యలో ఈ భవనం ఉంది. ఈ ప్రదేశాన్ని ఎవరుచూసిన ఇది ఎఫ్టిఎల్ భూమి అని చెప్పేస్తారు. ఈ భవనం నిర్మించి సంవత్సర కాలం దాటింది. ఓ విద్యాసంవత్సరం సైతం పూర్తి ఐయింది అయిన అధికారుల్లో మాత్రం ఎలాంటి చలనం లేదు దర్జాగా భవనం నిర్మించి పాఠశాల నడుపుతున్న ఎఫ్టిఎల్,వాల్టా చట్టం ఇలాంటి అడ్డు లు అధికారులు ఎవరు చెప్పనట్లు తెలుస్తోంది. నిత్యం ఇదే రహదారి నుంచి ప్రయాణం చేసే ఏ అధికారికైనా ఈ భవనం చెరువు పక్కనే కనపడుతుంది అయిన వారికి ఏమాత్రం పట్టింపు లేదు. ప్రధాన రహదారి నుంచి చెరువును ఆనుకొని ఉన్న ఈ పాఠశాలకు వెళ్లాలంటే పొలాలను దాటుకుని వెల్లాలి మొన్నటివరకు ఈ పాఠశాలకు దారి లేకపోతే మొరం పోసి దారిని సిద్ధం చేశారు. గత వర్షాకాలంలో అసలు నడవడానికి కూడా వీలు లేకుండా పోయింది.ఎ ప్టీ ఎల్ భూముల్లో నిర్మాణాల దర్జా...!- news10.app

అధికారులు ఎం చేస్తున్నట్లు..?

పక్క చెరువు శిఖం భూమిలో ప్రైవేట్ పాఠశాల భవనం నిర్మించి దర్జా వెలుగ బెడుతుంటే అసలు అధికారులు ఏంచేస్తున్నారో అర్థం కాని విషయం. ఎఫ్టిఎల్ భూమిని ఆక్రమించి ఇంటర్నేషనల్ పాఠశాల అంటూ నడుపుతుంటే అధికారులు మాత్రం కళ్ళు మూసుకుపోయినట్లు నటిస్తున్నారు. రెవెన్యూ, నీటిపారుదలశాఖ, విద్యా శాఖ అధికారులు తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. చెరువు శిఖం భూమిలో వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి నిర్మాణం చేపడితే విధ్యా శాఖ ఎలా అనుమతి ఇచ్చిందో తెలియడం లేదని పలువురు అంటున్నారు. మరోవైపు జాతీయ రహదారిని ఆనుకొని ఎలాంటి భద్రత లేకుండా చేరువు పక్కనే ఉన్న ఈ పాఠశాలకు అనుమతి ఇవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చెరువు శిఖంలో, పొలాల మధ్యన ఉన్న పాఠశాలలో ఉన్న విద్యార్థులకు ఏదైనా అపాయం తలెత్తితే ఎవరు బాద్యులని పలువురు ప్రశ్నిస్తున్నారు.ఎ ప్టీ ఎల్ భూముల్లో నిర్మాణాల దర్జా...!- news10.app

కన్వర్షన్ ఎలా…?

ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న భూమి పాఠశాల నిర్మాణం కోసం ఎలా కన్వర్షన్ ఐయిందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎఫ్టిఎల్ పరిధిలోని భూములు కొందరికి పట్టా ఉన్న, నీళ్లు లేనపుడు పంటసాగు చేయాలి తప్ప ఎలాంటి నిర్మాణం చేయకూడదని రెవెన్యూ అధికారులే చెప్తారు. కానీ ఈ పాఠశాల అవేమి పట్టించుకోకుండా అధికారులను ఏదోవిధంగా ప్రసన్నం చేసుకొని నిర్మాణం పూర్తిచేసి పాఠశాల నడుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక వేళ ఈ ఎఫ్టిఎల్ భూమిని అధికారులు నిర్మాణ యోగ్యమైన భూమిగా మార్చితే అది ఎలా సాధ్యం ఐయిందనేది ఇక్కడి గ్రామస్తుల ప్రశ్న. ఎవరి దగ్గరినుంచో శిఖం భూములను కొనుగోలు చేశామని చెప్పి నిబంధనలను తుంగలో తొక్కి అధికారుల సహకారంతో నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.