నాకు కరోనా సోకలేదు: పద్మాదేవేందర్ రెడ్డి

కరోనా సోకినట్లు వచ్చిన వార్తలను ఖండించిన మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి.
కరోనా పాజిటివ్ వచ్చిందని సోషల్ మీడియాలో పోస్టులు.
మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసిన తెరాస నాయకులు.
పోస్ట్​ను ఇతర వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసినందుకు మెదక్ మండలంలో ఒకరిపై కేసు నమోదు.
సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లను కొట్టిపారేసిన మాజీ ఉపసభాపతి.నాకు కరోనా సోకలేదు: పద్మాదేవేందర్ రెడ్డి- news10.app

తనకు కరోన సోకిందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి కొట్టిపారేశారు. కొందరు కావాలనే కరోన సోకిందని తనపై ప్రచారం చేస్తున్నారని అన్నారు. కాగా సోషల్ మీడియాలలో ప్రచారం అవుతున్న పుకార్లపై గులాబీ నేతలు మెదక్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసారు. కరోన సోకిందనే వార్తను వాట్సాప్ లో పార్వర్డ్ చేసినందుకు మెదక్ మండలంలో ఓ వ్యక్తిని పోలీసులు అఫుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.