నాణ్యతకు చెల్లు….?

వరంగల్ రూరల్ జిల్లా సివిల్ సప్లై లో ఇష్టారాజ్యం…
మిల్లు నుంచి నేరుగా MLS పాయింట్ కే
నాణ్యత పరిశీలించేది ఉండదు…. బియ్యాన్ని TA పరీక్ష నిర్వహించేది ఉండదు
పరీక్షలు లేకుండానే లోడ్ల కొద్ది బియ్యం తరలుతున్న వైనం
బియ్యం తరలింపులో సివిల్ సప్లై ఉన్నతాధికారి హస్తం….?
అనాలసిస్ పత్రాలు అడిగితే సమాధానం దాటవేస్తున్న గోదాం ఇంచార్జ్

నాణ్యతకు చెల్లు....?- news10.app

వరంగల్ రూరల్ జిల్లా పౌరసరఫరాల శాఖలో ఇష్టారాజ్యం కొనసాగుతుంది.మిల్లర్లతో దోస్తాన చేస్తున్న అధికారులు వారు చెప్పిన దానికి తానా..అంటే తందాన అంటున్నట్లు తెలుస్తుంది. దింతో నిత్యావసర వస్తువుల నాణ్యత విషయంలో అనుమానాలు కలుగుతున్నాయి. పౌరసరఫరాల శాఖ నుంచి ప్రజలకు చౌకధరకె వస్తువులు అందజేస్తున్న కొందరు అధికారుల నిర్లక్ష్యం, చేతివాటం మూలంగా వీటి విషయంలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా పేదలకు అందించాల్సిన బియ్యం, వివిధ ప్రభుత్వ వసతి గృహాలకు ఈ శాఖ నుంచే బియ్యం సరఫరా అవుతాయి. ఐయితే ఈశాఖ లో ఉన్న కొందరు అధికారులు మరీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మిల్లర్లతో కుమ్మకైయారన్న ఆరోపణలు వస్తున్నాయి.

చేతివాటం ఇలా…

పౌరసరఫరాల శాఖలో పని చేస్తున్న అధికారులు కేవలం మిల్లర్ల క్షేమమే చూస్తున్నారు. మిల్లు నుంచి గోడౌన్ కు వచ్చిన బియ్యం లోడును ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా నేరుగా గోడౌన్ లో అన్లోడ్ చేసి అక్కడినుంచి ఎం ఎల్ ఎస్ పాయింట్ కు తరలిస్తున్నారు. నిజానికి మిల్లునుంచి బియ్యం లోడ్ రాగానే టెక్నీకల్ అసిస్టెంట్ ద్వారా బియ్యం నాణ్యతను పరిశీలించి ఓకే చేయాలి. టి ఏ అందజేసిన అనాలసిస్ రిపోర్టు ఆధారంగా ఆ బియ్యం స్టాక్ పాయింట్ కు తరలుతుంది. కానీ వరంగల్ రూరల్ జిల్లా పౌరసరఫరాల శాఖలో అలాంటిది ఏమి లేకుండా బియ్యం ఎలా ఉన్నా ఏంత నాసిరకం ఐయిన ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా ఓకే చెప్పేస్తున్నారు. దింతో బియ్యం నాణ్యత విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నర్సంపేటలో ఇదే జరిగింది

పౌరసరఫరాల శాఖ అధికారులు నిర్లక్ష్యానికి తాజా ఉదాహరణగా సోమవారం నర్సంపేటలోని వ్యవసాయ మార్కెట్ లోని స్టాక్ గోడౌన్ లో ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా లారీ లోడ్ బియ్యాన్ని స్టాక్ పాయింట్ కు తరలించారు. జిల్లా లోని ఓ రైస్ మిల్లు నుంచి వచ్చిన 280 బస్తాల బియ్యాన్ని పరీక్షలు చేయకుండా అన్లోడ్ చేసి వెంటనే మరో వాహనంలో లోడ్ చేసి స్టాక్ పాయింట్ కు తరలించారు. దీనికి సంబంధించిన వివరాలను సంబంధిత గోడౌన్ ఇంచార్జ్ ను న్యూస్10 అడగగా వివరాలు త్వరలో ఇస్తామని దాటవేశారు. ఇతర పత్రాలన్ని ఇచ్చి అసలైన అనాలసిస్ రిపోర్ట్ కు సమయం కావాలన్నారు. అనాలసిస్ రిపోర్ట్ లేకుండా, బియ్యం నాణ్యత ను పరిశీలించకుండా మిల్లర్ బియ్యం లోడ్ ఎలా స్టాక్ పాయింట్ కు తరలిందన్న ప్రశ్నకు వారి వద్ద సమాధానం లేదు. అసలు అనాలసిస్ రిపోర్ట్ లేకుండా గింజ బియ్యం కూడా గోడౌన్ దాటి పోవద్దు కానీ అధికారులు మాత్రం వెంటవెంటనే పని కానిచ్చి మిల్లర్ పై ఉన్న భక్తిని చాటుకున్నారు

ఉన్నతాధికారి హస్తం…

బియ్యం నాణ్యత,అనాలసిస్ రిపోర్ట్ ఇవేమీ లేకుండా మిల్లర్ల బియ్యం స్టాక్ పాయింట్ కు తరలడంలో పౌరసరఫరాల శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి హస్తం ఉన్నట్లు తెలుస్తుంది. సోమవారం నర్సంపేటలో జరిగిన సంఘటన సైతం ఆయన కనుసన్నల్లోనే జరిగినట్లు సమాచారం. మిల్లర్లతో కుమ్మకై ఎలాంటి అనుమతులు, రిపోర్టులు లేకున్నా ఈ అధికారి బియ్యాన్ని స్టాక్ పోయింట్లకు తరలిస్తున్నాడని తెలిసింది. 2016, 2017, 2018, 2019సంవత్సరాలకు చెందిన బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి ఈ సంవత్సరానికి చెందిన బియ్యంగా నమ్మించడంలో ఈ అధికారి వారికి సహకారం అందిస్తూన్నట్లు విశ్వసనీయ సమాచారం.