ఉషోదయం సమగ్ర దినపత్రిక సంపాదకులు లాయక్ అలీ ఖాన్ రషీద్ మృతి

ఉషోదయం సమగ్ర దినపత్రిక పబ్లిషర్, ప్రదాన సంపాదకులు లాయక్ అలీ ఖాన్ రషీద్ మంగళవారం ఉదయం దివంగతులైనారు. 1994 నుండి ఉషోదయం సమగ్ర దినపత్రికను నడిపిస్తున్నారు. పత్రికా రంగం లోనే కాకుండా పలు స్వచ్చంద సీవాకర్యక్రమాల ద్వార సేవలను అందించి పలువురి ప్రశంసలు పొందారు. మాసాబ్ ట్యాంక్ లోని తన స్వంత ఇంటిలో లాయక్ అలీ ఖాన్ రషీద్ మరణించి నట్లు కుటుంబ సభ్యులు తిలిపారు. 1948 డిసంబర్ 12న మహమ్మద్ అక్బర్ ఆలీఖాన్ దంపతులకు రషీద్ జన్మించారు. ఆయనకు బార్య, కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మంచితనానికి నిలువెత్తు మారుపేరు అందరినీ ఆప్యాయంగా, ప్రేమతో పలకరించి చేరదీసి భవిష్యత్తు మార్గాన్ని చూపిన మహనీయుడని పలువురు కొనియాడారు.

ఉషోదయం సమగ్ర దినపత్రిక సంపాదకులు లాయక్ అలీ ఖాన్ రషీద్ మృతి- news10.app

ఉషోదయం పత్రికను అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని హంగులు సమకూర్చుతూ ఇతర పత్రికలు దీటుగా పోటీ తత్వంతో ప్రయాణానికి ముందుండి నడిపించిన మార్గదర్శి, సంపాదకులు లాయక్ అలీ ఖాన్ రషీద్ ఈ లోకాన్ని విడిచి వెళ్లడం తీవ్ర మనస్థాపానికి గురి చేసిందని ఎక్స్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీ ఎడిటర్ మహేశుని లక్ష్మయ్య పేర్కొన్నారు. కాగ లాయక్ అలీ ఖాన్ రషీద్ మృతిపట్ల మంచిర్యాలకు చెందిన కేశెట్టి వంశీకృష్ణ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలి మన అందరిని చల్లటి మనసుతో దీవించాలని ఆకాంక్షించారు. లాయక్ అలీ ఖాన్ రషీద్ మృతి పట్ల ఉషోదయం సమగ్ర దినపత్రిక శోక సముద్రం లో మునిగి పోయింది. ఆయన మృతి పట్ల పత్రిక సిబ్బంది ప్రగాడ సానుబూతిని సంతాపాని వ్యక్తం చేసింది.